Chirajeevi: అలా చేస్తే మాత్రం చిరంజీవి పైచేయి సాధిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ సీజన్లలో ఒకటైన సంక్రాంతి పండుగ సమయంలో వచ్చే ఏడాది మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలకు క్రేజ్ ఉండగా వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలు జనవరి 12వ తేదీనే రిలీజ్ కానున్నట్టు అధికారక ప్రకటన వెలువడింది. ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవుతుండగా ఫ్యాన్స్ మాత్రం వారసుడు సినిమా కంటే వీరసింహారెడ్డిపైనే ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం అయితే ఉంది. వారసుడు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరిస్తారు.

కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన వారసుడు సినిమా విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. అయితే రెండు సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించడంతో చిరంజీవి జనవరి 10వ తారీఖును రిలీజ్ డేట్ గా ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విధంగా చేస్తే రెండు రోజుల పాటు రికార్డ్ స్థాయిలో వాల్తేరు వీరయ్య మూవీకి కలెక్షన్లు వస్తాయి. లాంగ్ వీకెండ్ ను వాల్తేరు వీరయ్య వినియోగించుకునే ఛాన్స్ తో పాటు రెండు రోజుల పాటు ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది.

ఈ లక్కీ ఛాన్స్ ను వాల్తేరు వీరయ్య మూవీ వినియోగించుకుంటుందో లేదో చూడాలి. జనవరి 13 లేదా 14 తేదీలను ఎంచుకుంటే మాత్రం వాల్తేరు వీరయ్య థియేటర్ల విషయంలో కలెక్షన్ల విషయంలో నష్టపోయే అవకాశం ఉంది. వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ కు సంబంధించి తుది నిర్ణయం చిరంజీవిదే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరి చిరంజీవి ఈ సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలి. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి కానుందని బోగట్టా. విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus