ఏ ముహూర్తాన మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ ల.. ‘ఆచార్య’ మొదలైందో కానీ.. అప్పటి నుండీ ఈ చిత్రం షూటింగ్ కు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. మొదట ఈ చిత్రంలో ఓ పాత్రకు మహేష్ బాబు ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అతన్ని తప్పించారు. అటు తరువాత హీరోయిన్ త్రిష .. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. దాంతో కాజల్ ను రీప్లేస్ చేశారు. ఇక మహేష్ చెయ్యాల్సిన పాత్రను చరణ్ తో చేయిస్తున్నారు.
అంతా బానే ఉంది అనుకుంటున్న టైములో కరోనా వచ్చి షూటింగ్ కు బ్రేక్ పడేలా చేసింది. లాక్ డౌన్ మొదలైన రెండు నెలల తరువాత షూటింగ్ కు పర్మిషన్ తెచ్చుకున్నారు చిరు. కానీ తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ తో అది సాధ్యం కాదని డ్రాప్ అయ్యారు. మధ్యలో వేసిన గుడి సెట్ వల్ల కోటి రూపాయల వరకూ నష్టం వచ్చినట్టు సమాచారం. సరే ఇదంతా పక్కన పెట్టేసినా.. నవంబర్ 9 నుండీ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ను మొదలుపెట్టి..
2021 మార్చి కి ఫినిష్ చేసి సమ్మర్ కానుకగా విడుదల చెయ్యబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కానీ అనూహ్యంగా మెగాస్టార్ కరోనా భారిన పడటంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. మెగాస్టార్ మరో 4 వారాలు లేదా 45 రోజుల వరకూ బ్రేక్ తీసుకోవాల్సిందేనట. దాంతో మరో రెండు నెలలు ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడినట్టే అని తెలుస్తుంది. ఆ రకంగా చూసుకుంటే.. 2021 సమ్మర్ కు ‘ఆచార్య’ విడుదలయ్యే అవకాశం లేదని స్పష్టమవుతుంది.
Most Recommended Video
ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!