Jr NTR, Mokshagna: మోక్షజ్ఞ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలా చేస్తారా?

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు సక్సెస్ సాధించగా ఈ మధ్య కాలంలో నందమూరి హీరోలకు వరుసగా విజయాలు దక్కుతున్నాయి. సీడెడ్ లో నందమూరి హీరోల సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. కళ్యాణ్ రామ్ సినిమాలు సైతం నిర్మాతలకు నష్టాలను మిగల్చడం లేదు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి అతి త్వరలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అయితే మోక్షజ్ఞకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉంటే కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా భాషతో సంబంధం లేకుండా ప్రశంసలు అందుకుంటున్నారు. కథల విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయాలు రైట్ అవుతుంటాయి. టెంపర్ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తూ తారక్ మార్కెట్ ను పెంచుతోంది.

మోక్షజ్ఞ పాన్ ఇండియా హీరో అయ్యే విషయంలో ఎన్టీఆర్ సపోర్ట్ ఉంటే కచ్చితంగా బాగుంటుందని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ నందమూరి ఫ్యాన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కు ఎలాంటి కథలు నచ్చుతాయో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. బాలయ్య లేదా మోక్షజ్ఞ కోరితే తన వంతు సహాయసహకారాలు అందించడానికి ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారు.

ఈ నెల 23వ తేదీన ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ పూజా కార్యక్రమాలు మొదలుకానున్నాయని తెలుస్తోంది. చిరంజీవి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కానున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ మరింత స్పెషల్ గా ఉండనుందని ఈ సినిమా రికార్డులు చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus