Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఆ ఒక్క పని చేస్తారా?

  • February 3, 2023 / 01:34 PM IST

సీనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకునిగా, రాజకీయనేతగా సత్తా చాటారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి సంచలనాలు సృష్టించాయి. టాలీవుడ్ గొప్ప డైరెక్టర్లలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చాలామంది భావిస్తారు. అయితే భవిష్యత్తులో తారక్ కూడా డైరెక్టర్ కావాలని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతి విషయం గురించి జూనియర్ ఎన్టీఆర్ కు అవగాహన ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తే రిషబ్ శెట్టిలా ఆయన కూడా గొప్ప డైరెక్టర్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఈ ఒక్క పని చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి తారక్ ఈ ఒక్క పని చేస్తారో లేదో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా ప్రూవ్ చేసుకోగా తారక్ కూడా రెండు రంగాల్లో ప్రూవ్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

అయితే డైరెక్షన్ గురించి తారక్ ఎప్పుడూ స్పందించలేదు. రాబోయే రోజుల్లో ఏదైనా ఇంటర్వ్యూలో తారక్ డైరెక్షన్ గురించి పెదవి విప్పుతారేమో చూడాల్సి ఉంది. తారక్ అతి త్వరలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది.
ఒకే సమయంలో తారక్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించనున్నారు. దర్శకుడు కొరటాల శివ మీడియా ముందుకు రావడానికి ఇప్పటికీ భయపడుతున్నారు.

అయితే తారక్ కొరటాల శివ కాంబినేషన్ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా కథకు సంబంధించి ఎన్నో అప్ డేట్స్ వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. తారక్ కొరటాల శివ కాంబో మూవీ బడ్జెట్ 250 కోట్ల రూపాయలు కాగా రిలీజ్ సమయానికి ఈ బడ్జెట్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus