హిట్టిచ్చిన డైరెక్టర్ల డైరెక్షన్ లో యంగ్ టైగర్ నటిస్తారా?

గత కొన్నేళ్లలో చాలామంది డైరెక్టర్లు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు హిట్లు ఇచ్చారనే సంగతి తెలిసిందే. టెంపర్ సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు తారక్ నటించిన ప్రతి సినిమా బిజినెస్ కు అనుగుణంగా రికార్డ్ రేంజ్ లో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయనే సంగతి తెలిసిందే. తారక్ సినిమాలు ఎప్పుడు విడుదలైనా రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తుండగా తారక్ కొత్త సినిమాకు సంబంధించి మార్చి నెలలో వరుస అప్ డేట్లు రావడంతో పాటు ఈ సినిమా షూట్ కూడా మొదలుకానుంది.

అయితే తారక్ తో మళ్లీ పని చేయాలని ఆశ పడుతున్న డైరెక్టర్ల సంఖ్య తక్కువేం కాదు. ఇప్పటికే తారక్ తో సినిమాలు తీసిన దర్శకులు తారక్ తో మరో సినిమాకు పని చేసే అదృష్టం దక్కితే దక్కితే బాగుంటుందని అనుకుంటున్నారు. టెంపర్ సినిమాతో పూరీ జగన్నాథ్, నాన్నకు ప్రేమతో సినిమాతో సుకుమార్, జై లవకుశ సినిమాతో బాబీ, అరవింద సమేత వీర రాఘవ సినిమాతో త్రివిక్రమ్, ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి తారక్ కు కెరీర్ బెస్ట్ హిట్లు ఇవ్వగా ఈ డైరెక్టర్ల డైరెక్షన్ లో తారక్ మళ్లీ ఎప్పుడు నటిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

ఈ డైరెక్టర్లలో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకులు సైతం ఉన్నారు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ల డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ నటించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా తారక్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది. తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ చేసే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్32 సినిమాకు సంబంధించి ఎప్పుడు అప్ డేట్ వస్తుందో చూడాల్సి ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus