Jr NTR: ఆ షోకు హోస్ట్ గా ఎన్టీఆర్ ఒప్పుకుంటారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో ప్రస్తుతం జోరుమీదున్నారు. టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయం సాధిస్తోంది. ఎన్టీఆర్ పర్ఫామెన్స్ వల్లే ఈ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ నటించిన ఎమోషనల్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే. మరోవైపు బిగ్ బాస్ సీజన్1 కు హోస్ట్ గా వ్యవహరించి తారక్ బుల్లితెరపై కూడా సంచలనాలను సృష్టించారు.

ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్2 కు హోస్ట్ గా చేసే ఛాన్స్ దక్కినా ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ను వదులుకున్నారనే సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఎవరు మీలో కోటీశ్వరులు షోకు తారక్ హోస్ట్ గా వ్యవహరించారు. జెమినీ ఛానల్ లో ప్రసారమైన ఈ షోకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదు. ఎన్టీఆర్ హోస్టింగ్ బాగానే ఉన్నా ఈ షో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదు.

వీక్ డేస్ లో ప్రసారం చేయడం కూడా ఈ షోపై ఒకింత నెగిటివ్ ఎఫెక్ట్ పడటానికి కారణమైంది. ఈ షో కోసం ఎన్టీఆర్ రికార్డ్ స్థాయిలో పారితోషికం తీసుకున్నారని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్2 ఉంటుందా? ఉండదా? అనే చర్చ ప్రేక్షకుల మధ్య జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న చాలా షోలు ప్రేక్షకులను మెప్పించడం లేదు.

వీకెండ్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో సీజన్2 ను ప్రసారం చేస్తే ఈ షో కచ్చితంగా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఇతర భాషల్లో, విదేశాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus