Jr NTR: 2023లో అయినా తారక్ వేగం పెంచుతాడా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాల షూటింగ్ కు సంబంధించి సరైన అప్ డేట్స్ లేవు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి లొకేషన్స్ ఎంపిక జరుగుతోందని సమాచారం అందుతోంది. అయితే 2023లో అయినా తారక్ వేగం పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ అభిప్రాయాలను తారక్ పరిగణనలోకి తీసుకోవాలని అభిమానులు కోరుకున్నారు.

కొరటాల శివ సినిమాను 2023 ఫస్ట్ హాఫ్ లోనే విడుదల చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ షూట్ తక్కువ రోజుల్లోనే పూర్తైన సంగతి తెలిసిందే. తారక్ కొరటాల శివ తర్వాత ప్రాజెక్ట్ తో బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తారక్ కెరీర్ తొలినాళ్లలో ఆరు నెలలకు ఒక సినిమాను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.

తారక్ కొరటాల శివ కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అభిమానులను ఎన్నో సందేహాలు వేధిస్తున్నాయి. తారక్ తన రేంజ్ ను పెంచే ప్రాజెక్ట్ లకు ఎక్కువగా ఓటేయాల్సి ఉంది. కలెక్షన్ల విషయంలో సైతం కొత్త రికార్డులు సృష్టించాల్సి ఉంది. తారక్ నటించే ప్రతి సినిమా 400 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉందని అభిమానులు భావిస్తున్నారు.

తారక్ కొరటాల శివ కాంబో మూవీ మైథలాజికల్ టచ్ ఉన్న కథతో తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. తారక్ టాలెంట్ కు తగ్గ కథ దొరికితే నటనతో ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తారని మరి కొందరు చెబుతున్నారు. తారక్ వచ్చే ఏడాది రెండు సినిమాలను పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus