Jr NTR: ఫ్యాన్స్ కోరికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో?

ఈతరం హీరోలలో పౌరాణిక పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే హీరో జూనియర్ ఎన్టీఆర్ అని ఎక్కువమంది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాల రామాయణం సినిమాలో తారక్ రాముడి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే తారక్ మరోసారి రాముడి రోల్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి ఫ్యాన్స్ కోరికను దృష్టిలో ఉంచుకుని జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు ఈరోజు నుంచి తారక్ (Jr NTR) కొరటాల శివ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. భారీ రేంజ్ లో మేకర్స్ ఈ సినిమాను ప్లాన్ చేయగా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం మరింత ఎక్కువగా కష్టపడుతున్నారని సమాచారం. తారక్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

సినిమాలో షాకింగ్ ట్విస్ట్ తో పాటు మైథలాజికల్ టచ్ ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ మాత్రం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. కృతిశెట్టి నుంచి లేదా మేకర్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంటుంది. తారక్  భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో సొంత నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఉంటుందని సమాచారం అందుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus