Rajamouli , Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్న రాజమౌళి?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ థింగ్ అంటే ఈ ప్రాజెక్టే అని చెప్పాలి. అయితే రాజమౌళి పలు సందర్భాల్లో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడటమే తప్ప.. ‘ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది’ అంటూ ఏమీ లేదు. కనీసం దీని గురించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా లాక్ చేస్తున్నాడు రాజమౌళి. మరోపక్క మహేష్ బాబు గడ్డం పెంచుకుని తిరుగుతున్నాడు. బాడీ పెంచడానికి జిమ్లో తెగ కసరత్తులు కూడా చేస్తున్నాడు.

Rajamouli , Mahesh Babu

ఇదిలా ఉంటే.. మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఏ జోనర్లో ఉంటుంది అనే విషయం పై మాత్రం ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ డ్రామా ఇది అని చెబుతూ ‘గ్లోట్ ట్రోటరింగ్’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం లొకేషన్ వేట జరుగుతుంది. జర్మనీలోని అడవుల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్..లు చిత్రీకరిస్తారట. అలాగే ఈ ప్రాజెక్టు కూడా పీరియాడిక్ డ్రామాగా ఉంటుందట. అంతేకాకుండా ‘మైథాలజీ’ టచ్ కూడా ఉంటుందని సమాచారం.

పురాణాల కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ ఇప్పటివరకు మహేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో దివంగత కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో.. ఇలాంటి జోనర్ ను టచ్ చేస్తూ మహేష్ ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. సో పురాణాల కాన్సెప్ట్ తో మహేష్ – రాజమౌళి సినిమా చేస్తున్నారు అంటే చిన్న విషయం కాదు.

‘కల్కి’ (Kalki 2898 AD) రిలీజ్ అయినప్పుడు కూడా మహేష్ ని కృష్ణుడి పాత్రలో చూపిస్తే బాగుంటుంది అంటూ నెటిజెన్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలో మహేష్ 2 రకాల గెటప్..లలో కనిపిస్తాడట. ఒకటి గుబురు గడ్డంతో ఇంకోటి గడ్డం లేకుండా ఉంటుందని టాక్. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారని చాలా రోజుల నుండి టాక్ నడుస్తుంది.

ఫ్లాప్ దర్శకుడితో హిట్ సినిమా రీమేక్ కి రంగం సిద్ధం .!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus