శంకర్ సినిమా సెంటిమెంట్లను నమ్ముతారో లేదు తెలియదు కానీ… ఆయన సినిమాల విషయంలో హీరోయిన్ల సెంటిమెంట్ ఒకటి అయితే ఉంది. ఇటీవల కాలంలో శంకర్ సినిమాలో నటించిన హీరోయిన్ల, భవిష్యత్తు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. అదే ఆయనతో సినిమా చేసిన తర్వాత ఆ హీరోయిన్ ఫ్యూచర్ ఏమంత ఆశాజనకంగా ఉండదు. హిట్ సినిమాలు చేస్తూ చేస్తూ… ఆయనతో సినిమా చేస్తే ఆ తర్వాత అవకాశాలు అరకొరగానే వస్తుంటాయి అంటారు. కావాలంటే ఆయనతో సినిమాలు చేసిన రీసెంట్ నాయికల పరిస్థితి చూడొచ్చు.
శంకర్ సినిమా అంటే మ్యాగ్జిమమ్ ఇండస్ట్రీ హిట్. అందులో హీరోయిన్లక మంచి ప్రాధాన్యతే ఉంటుంది. కానీ ఆ సినిమా తర్వాత అంతగా ఉండదు. అయితే దీనికి ఇద్దరు మాత్రమే ఎగ్జంప్షన్ అని చెప్పొచ్చు. ఒకరు ఐశ్వర్యరాయ్, రెండోది శ్రియ. అయితే శంకర్ సినిమాల తర్వాత వీళ్లకు పెద్ద అవకాశాలు వచ్చింది లేదు. అలా అని ఖాళీగా ఉన్నది లేదు. వీళ్ల సంగతి పక్కనపెట్టి మిగిలిన హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం. అప్పుడో క్లారిటీ వస్తుంది.
‘ఐ’లో నటించిన తర్వాత ఆమీ జాక్సన్‌కు పెద్దగా అవకాశాలు వచ్చింది లేదు. ‘2.0’ సినిమా శంకర్‌తో తీయడం తప్ప. ‘శివాజీ’ తర్వాత శ్రియ లైఫ్‌లో పెద్ద మార్పేమీ రాలేదు. అప్పటివరకు దూసుకుపోతున్న సదా… ‘అపరిచితుడు’ తర్వాత స్లో అయిపోయింది. తర్వాత ఇండస్ట్రీలో కనిపించడం లేదు. అయితే శంకర్ హీరోయిన్ అప్పటికే పెద్ద స్టార్ అయి ఉంటే… కొన్నాళ్లు ఆ తర్వాత కూడా కొనసాగారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. శంకర్ నెక్స్ట్ రెండు సినిమాల్లో కియారా అడ్వాణీనే నాయికగా తీసుకున్నారట. ‘అపరిచితుడు’ రీమేక్, రామ్‌చరణ్- దిల్ రాజు సినిమాలో కియారానే నాయిక అంటున్నారు. దీంతో కియారా పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. రీసెంట్ శంకర్ హీరోయిన్లలా సైలెంట్ అవుతుందా? అంతకుముందు నాయికల్లా దూసుకుపోతుందా చూడాలి.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!