ఏ హీరోకైనా డ్రీం రోల్ అనేది ఉంటుంది. పలానా పాత్రలో ఎప్పటికైనా నటించాలనే ఆశ ఉంటుంది. మెగాస్టార్ కు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథలో నటించాలని కోరిక ఉండేది.10 ఏళ్ళు దాని కోసం నిరీక్షించారు. దానిని తన అభిరుచికి తగ్గట్టు తీర్చిదిద్దే దర్శకుడి కోసం వేట మొదలుపెట్టారు. చివరాఖరికి సురేందర్ రెడ్డి ని పట్టుకుని తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తెరపై ఆవిష్కరించగలిగారు. సరిగ్గా ఇలాగే మన వెంకటేష్ కు కూడా ఓ డ్రీం ప్రాజెక్టు ఉంది.
`వివేకానంద` కథని సినిమాగా తీయాలన్నది ఆయన కల. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పాడు. వివేకానంద బోధనల ప్రభావం ఆయన పై చాలా ఉందని అవసరమైతే దానిని సీరియల్ గా తీసినా నటించడానికి సిద్ధం అని వెంకీ గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చారు.దర్శకుడు నీలకంఠతో కొన్ని రోజులు ఈ స్క్రిప్టు పై ఆయన వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నీలకంఠ స్క్రిప్ట్ పట్ల వెంకీని తృప్తి పరచలేదు.దాంతో ఆయన్ని పక్కన పెట్టారు వెంకీ.
అయితే కొరటాల శివకి కూడా వివేకానంద కథతో సినిమా తీయాలనే కోరిక ఉందట. తనకు వివేకానందుడే స్ఫూర్తి అని, ప్రపంచానికి తన కథనిచెప్పాలనుకుంటున్నానని ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా చెప్పుకొచ్చాడు కొరటాల. `గాంధీ` స్థాయిలో అంతర్జాతీయ చిత్రంగా ఈ కథని మలచాలనేది కొరటాల కోరికట.అంటే వెంకీ డ్రీం ప్రాజెక్టుకి దర్శకుడు దొరికినట్టే.! కొరటాల కామెంట్లు కనుక వెంకీ విన్నట్టు అయితే కనుక వివేకానంద ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లడానికి ఆస్కారం ఉంది.
అయితే కొరటాల కనుక ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేస్తే రిస్క్ కూడా ఉంటుంది. ఆయన గొప్ప కమర్షియల్ డైరెక్టర్. ఆయన నుండీ కమర్షియల్ ఎలిమెంట్స్ జనాలు ఎక్కువగా ఆసిస్తూ ఉంటారు. కాబట్టి స్క్రిప్ట్ వరకు కొరటాల చూసుకుని డైరెక్షన్ వేరే వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది అనేది కొందరి సినీ పెద్దల భావన.
Most Recommended Video
‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!