Koratala Siva: దర్శకుడు కొరటాల శివ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి రెండేళ్ల క్రితం ప్రకటన వెలువడగా ఎన్నో ఆటంకాలను దాటుకుని ఈ సినిమా ఈ నెల మూడో వారం నుంచి షూట్ మొదలుకానుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నప్పటికీ ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి.అయితే తారక్ తో తీసే సినిమాను కచ్చితంగా హిట్ చేయాల్సిన బాధ్యత కొరటాల శివపై ఉంది. ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ లో కొరటాల శివ సినిమాను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కడంతో పాటు ఆ సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించి మంచి లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం. ఎన్టీఆర్ జాన్వీ కాంబో కూడా కూడా ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబో హిట్ కాంబో అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత కావడంతో తారక్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

తారక్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి హీరోలను ఒకే ఫ్రేమ్ లో అభిమానులు ఎప్పుడు చూస్తారో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్30 మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాతో కొరటాల శివ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ చేరుతుందని కొరటాల శివ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ మూవీ రిజల్ట్ విషయంలో కొరటాల శివ పూర్తిస్థాయిలో నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. గతంలో సినిమాల బిజినెస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న కొరటాల శివ ఇకపై ఆ విషయాలకు సంబంధించి జోక్యం చేసుకోకూడదని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus