సినిమా – పరాజయం – నష్టాలు – నిరసనలు – నష్ట పరిహారాలు.. ఈ చైన్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న సినిమాల విషయంలో, ఫ్లాప్ విషయంలో ఇది పెద్దగా కనిపించదు. అయితే పెద్ద హీరో సినిమా, బ్లాక్‌బస్టర్ ఫ్లాప్ అయితే కచ్చితంగా పై చైన్ వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న సినిమా ‘ఆచార్య’. చిరంజీవి – రామ్‌చరణ్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చి దారుణమైన ఫలితం అందుకున్న సినిమా ఇది. కనీసం ఫ్యాన్స్‌ను కూడా సంతృప్తపరచని సినిమా ఇది.
ఈ సినిమా ఫలితంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయారు. సినిమాకు రూ. 80 కోట్ల వరకు లాస్ వచ్చిందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ… నష్టమైతే భారీగానే ఉందంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, రామ్‌చరణ్ సినిమాకు సంబంధించి రెమ్యూనరేషన్ వదులుకున్నారని చెబుతున్నారు. సినిమా పరాజయానికి నష్టపరిహారంగానే రెమ్యూనరేషన్ వదులుకున్నారని టాక్. దర్శకుడు కొరటా శివ రెమ్యూనరేషన్ సంగతి తెలియదు. ఇదంతా ఓ కోణం.
ఇప్పుడు కొరటాల ఆఫీసులో జరుగుతున్న చర్చ మాత్రం వేరేలా ఉంది. సినిమా నష్టానికి పరిహారం కావాలంటూ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆయనను చుట్టుముట్టుడుతున్నారు. చాలా ఏరియాలకు సంబంధించి కొరటాల డబ్బులు చెల్లించారట. ఇంకా కొంతమందికి తేల్చాల్సి ఉంది. ఇక్కడే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను తెలుసుకోవాలి. #JusticeForKoratalaShiva అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంటే సినిమా వల్ల కొరటాల నష్టపోయారని, ఇప్పుడు సినిమా టీం ఆదుకోవాలని అర్థం.
ఇక్కడ విషయం ఏంటంటే.. దర్శకుడిని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు పరిహారం అడుగుతున్నారు? సినిమా బాగాలేకపోతే సరైన కథ, కథనం, డైరక్షన్ ఎందుకు లేదు అని దర్శకుడిని అడగాలి. కానీ డబ్బులు ఎందుకు అడుగుతున్నారు. దీనికి కారణం ‘ఆచార్య’ బిజినెస్ వ్యవహారాల్లో కొరటాల కీలకంగా ఉండటమే. ఇప్పుడే కాదు గతంలో కూడా కొరటాల ఇలా బిజినెస్ వ్యవహారాల్లో యాక్టివ్‌గానే ఉన్నారు. అప్పుడు కూడా చిన్నపాటి సమస్యలు వచ్చాయి. కొరటాల తన సినిమాల బిజినెస్ విషయంలో యాక్టివ్ ఉండటానికి కారణం..
కొన్ని ప్రాంతాల్లో తన సన్నిహితులకు సినిమా హక్కులు అందేలా చూసుకోవడమే అంటారు. సినిమా హిట్ అయితే సన్నిహితులకు మంచి సినిమా ఇచ్చినట్లు అవుతుంది. అప్పుడు ఇలాంటి హ్యాష్ ట్యాగ్‌లు వచ్చేవి కావు. సినిమా పోయి, డబ్బులు పోయాయి కాబట్టే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి హ్యాష్‌ట్యాగ్‌లు, చర్చలు, ట్రెండింగ్‌లు అన్నిసార్లు ఒకేలా ఉండవు. అయితే కొరటాల బిజినెస్ వ్యవహారాల్లో కాకుండా సినిమా కథ, స్క్రిప్ట్ మీద కూడా దృష్టి పెట్టి ఉంటే ఈ బాధ ఉండేది కాదు అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!