Laal Singh Chaddha: మక్కీకి మక్కీ దించేశారుగా..!

హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాకి రీమేక్ గా రూపొందించిన సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. ‘ఫారెస్ట్ గంప్’ సినిమా 1994లో విడుదలైంది. ఇన్నేళ్ల తరువాత దాన్ని రీమేక్ చేసే ఆలోచన ఒకరకంగా సాహసమనే చెప్పాలి. హాలీవుడ్ సినిమా అయినప్పటికీ.. అన్ని భాషల సినీ ప్రియులకు ఈ సినిమా చేరువైంది.

ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్స్ ఉండవు. ఒక వ్యక్తి జీవిత కథే ఈ సినిమా. నిజానికి ఒక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అదేమీ గొప్ప నవల కూడా కాదు. పేలవమైన ఈ స్టోరీకి అద్భుత రూపకల్పనగా ‘ఫారెస్ట్ గంప్’ నిలుస్తుంది. ఈ సినిమా కథ ఎంతమాత్రం కన్విన్సింగ్ గా ఉండదు. ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా దర్శకుడు చేయలేదు. కానీ టామ్ హాంక్స్ నటన, అతడి క్యారెక్టర్ ప్రయాణం.. ఇదంతా ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ తరహా క్యారెక్టరైజేషన్ తో ఇండియాలో ‘స్వాతిముత్యం’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో కమల్ హాసన్ మానసిక స్థితి ఎలాంటిదో ‘ఫారెస్ట్ గంప్’ కూడా అలాంటి వ్యక్తే. పూర్తి స్థాయిలో మాన‌సిక ప‌రివ‌ర్త‌న లేని ఒక స‌క్సెస్ ఫుల్ మ్యాన్ క‌థ ఫారెస్ట్ గంప్. అమెరిక‌న్ సొసైటీ నుంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్ అది. అక్కడి కథ ఇండియాకు సెట్ కాదనో మరో కారణం వలనో కానీ ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరూ రీమేక్ చేయాలనుకోలేదు.

అలాంటి కథను ఆమిర్ ఖాన్ రీమేక్ చేసే సాహసం చేశారు ఆమిర్ ఖాన్. ట్రైలర్ చూస్తే మక్కీకి మక్కీ సినిమాను దించేసినట్లు ఉన్నారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus