Mahesh Babu: మహేష్ బాబు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా?

గతేడాది ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించడం వల్ల పెద్ద సినిమాలు విడుదల సమయంలో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం రెండు నెలల క్రితం టికెట్ రేట్లను పెంచుతూ కొత్త జీవోను జారీ చేసింది. టికెట్ రేట్ల పెంపు కోసం సీఎం జగన్ ను కలిసిన హీరోలలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు ఉన్నారు. అయితే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిరంజీవి నటించిన ఆచార్య ఫ్లాప్ అయ్యాయి.

ఈ విధంగా జరగడం వల్ల జగన్ ను కలిసిన హీరోల సినిమాలు ఫ్లాపయ్యాయంటూ నెట్టింట ఒక మీమ్ వైరల్ అవుతోంది. ఈ మీమ్ మహేష్ బాబు అభిమానులను సర్కారు వారి పాట రిజల్ట్ విషయంలో టెన్షన్ పెడుతోంది. అయితే మహేష్ బాబు ఈ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేస్తారని కొందరు అభిమానులు భావిస్తారు. సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచింది.

సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్ లో అంచనాలకు మించి రికార్డులను సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో నిలవడంతో పాటు ట్రైలర్ లోని డైలాగ్స్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో సర్కారు వారి పాట తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా భారీ లాభాలు సాధిస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కు గత కొంతకాలంగా సక్సెస్ లేదు. అయితే సర్కారు వారి పాట సినిమా మాత్రం కచ్చితంగా తనను సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేలా చేస్తుందని కీర్తి సురేష్ నమ్ముతున్నారు. మే 12వ తేదీన గురువారం రోజున ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా రెగ్యులర్ బయ్యర్లకే ఈ సినిమా హక్కులు ఇచ్చారని తెలుస్తోంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus