సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే స్పెషల్‌ ట్రీట్‌ ఉంటుందా? జక్కన్న ప్లాన్స్‌ ఏంటి?

మహేష్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి  (SS Rajamouli) కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుంది… ఈ విషయంలో స్పష్టమైన సమాధానం అయితే లేదు కానీ ఏప్రిల్‌ 9న సినిమాను లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారు అని అంటున్నారు. డేట్‌, సందర్భం తదితర లెక్కలు చూసుకుని ఆ రోజు ముందుకెళ్తారు అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ త్వరలో వచ్చేస్తుంది కానీ… మే 31న ఏం జరుగుతుంది అనే చర్చ ఇప్పుడు కొత్తగా మొదలైంది. ఆ రోజు ప్రత్యేకత ఏంటో సూపర్‌ స్టార్‌ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

టాలీవుడ్‌ ఫస్ట్ సూపర్‌ స్టార్‌ కృష్ణ (Krishna) జయంతి ఆ రోజు. ఏటా ఇదే రోజున మహేష్ బాబు సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌ కచ్చితంగా ఉంటాయి. పోస్టరో, టీజరో, ట్రైలరో ఏదో ఒకటి తీసుకొస్తుంటారు. ఇప్పుడు సెట్స్‌ మీదకు వచ్చే కొత్త సినిమా #SSMB29 కాబట్టి ఆ సినిమా అప్‌డేట్‌ రావాలి. అయితే రాజమౌళి సినిమా ఓ పట్టాన తేలేది కాదు. అందులోనూ సినిమా షూటింగ్‌ ఆ రోజుకు స్టార్ట్ అవుతుందా అనేది కూడా క్లారిటీ లేదు. దీంతో సూపర్‌ స్టార్‌ స్పెషల్‌ డే నాడు స్పెషల్‌గా ఏం తీసుకొస్తారు అనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం మహేష్‌ బాబు లుక్‌ టెస్టులు జరుగుతున్నాయట. మొత్తంగా తొమ్మిది లుక్స్‌ సిద్ధం చేశారని, వాటిలో ఒకటి ఫిక్స్‌ చేస్తారని చెబుతున్నారు. అయితే అందులో ఓ లుక్‌ విషయంలో రాజమౌళి బాగా ఆసక్తిగా ఉన్నారట. అయితే దీని కోసం మహేష్‌ గెడ్డం, జుట్టు బాగా పెంచుకోవాల్సి ఉందట. అయితే ఇలాంటి లుక్‌లో మహేష్‌ ఇంతవరకు కనిపించలేదు. ఒకవేళ ఈ లుక్‌ ఓకే అనుకుంటే… అదే సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే సర్‌ప్రైజ్‌ అవుతుంది అని అంటున్నారు.

ఇక ఈ సినిమాను ఇప్పుడు వరకు ఉన్న ఆలోచనల ప్రకారం అయితే 2026లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే జక్కన్న సినిమాలు అనుకున్నట్లు సమయానికి రావడం చూడటం అరుదు. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus