మెగా బ్రదర్స్‌ రీమేక్‌లు ఆపేస్తారా? అసలు ఆపాలా? ఆపాల్సిన అవసరం ఉందా?

రీమేక్‌లు చేయడం తప్పా? గతంలో ఎవరూ చేయలేదా? మంచి కథ కాబట్టే రీమేక్‌ చేశాం? అంటూ మొన్నీమధ్య మెగాస్టార్‌ చిరంజీవి ‘భోళా శంకర్‌’ సినిమాను ప్రమోట్‌ చేసే నేపథ్యంలో మాట్లాడారు. ‘బ్రో’ సినిమా వచ్చిన తర్వాత రీమేక్‌లపై కామెంట్స్‌ వచ్చినప్పుడు పవన్‌ కల్యాణ్‌ తరఫు నుండి కూడా దాదాపు ఇలాంటి చర్చే వచ్చింది. అయితే ఏం జరిగినా రీమేక్‌ల విషయంలో మాటలు పడుతున్నా.. మనసు మాత్రం మారడం లేదు. అందుకే రీమేక్‌లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే చర్చ నడుస్తోంది.

చిరంజీవి కెరీర్‌లో రీమేక్‌లు చేయడం కొత్తేమీ కాదు.. అలా రీమేక్‌లు చేసి ఇండస్ట్రీ హిట్‌లు కొట్టారు. అయితే అదే సమయంలో దారుణమైన ఫ్లాప్‌లు కూడా ఎదుర్కొన్నారు. రీసెంట్‌ మూడు సినిమాల్లో రెండు రీమేక్‌లే. ఇక పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో మేజర్‌ శాతం రీమేక్‌లే అని చెప్పాలి. రీసెంట్‌గా వచ్చిన మూడు సినిమాలు, విజయాలు రీమేక్‌లే. ఈ మూడు సినిమాలు విజయాలు సాధించాయి అంటున్నారు, కానీ వసూళ్ల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి అనే మాటలు వినిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న వచ్చిన ‘బ్రో’ సినిమా ఫలితం, ఇప్పుడు వచ్చిన ‘భోళా శంకర్‌’.. వీటి ఫలితాలు చూసి ఫ్యాన్స్‌ కానీ, ప్రేక్షకులు కానీ హ్యాపీగా లేరు అని అంటున్నారు. దానికి కారణం ఇంతటి పెద్ద స్టార్లు రీమేక్‌లు నమ్ముకోవడం ఏంటి అనేది చర్చ. మన దగ్గర కథకులు లేరా? దర్శకులు లేరా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు స్టార్‌ హీరోలు ఇలా చేస్తే చూడలేం అంటూ కాస్త ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ ఏమన్నా ఫ్యాన్స్‌ మాటలకు గౌరవం ఇస్తారా అనేది చూడాలి.

అయితే ఇప్పటికప్పుడు చిరంజీవి, పవన్‌ రీమేక్‌లు ఆపేసే పరిస్థితి లేదు. ‘బ్రో డాడీ’ సినిమాను చిరంజీవీ ఆల్‌రెడీ ఓకే చేసేశారు. పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభం ఉంది అంటున్నారు. ఇక పవన్‌ అయితే ‘తెరి’ రీమేక్‌ను ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా తీసుకురాబోతున్నారు. కాబట్టి ఆ తర్వాత అయినా రీమేక్‌లు ఆపేయాలి అని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus