ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్టార్ నుంచి టైర్ 3 హీరోల వరకు అందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై గట్టిగానే ఫోకస్ చేశారు. అన్ని సినిమాలతోను అది సాధ్యం కాదు కాబట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమా వచ్చినప్పుడు పాన్ ఇండియా హిట్టు కోసం ఆరటపడుతున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కూడా చందు మొండేటి (Chandoo Mondeti) రూపొందిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’పై (Thandel) భారీ ఆశలు పెట్టుకున్నాడు. పాకిస్థాన్ జైలులో మగ్గిన భారతీయ మత్స్యకారుడి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రేమ, యాక్షన్ తరహాలో ఉండనుంది.
సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా చైతన్య కెరీర్‌కు పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ తీసుకు రానుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసి, దక్షిణాది నుంచే ఉత్తరాది వరకు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
జనవరి 26న ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం. ఈ చిత్రంలోని ప్రధాన సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలిస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తండేల్ ప్రమోషన్లు భారీగా ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య, చందు మొండేటి ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్ చేయనున్నారు. ఇది చైతన్యకు హిందీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే అదృష్టంగా మారనుంది. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu) నిర్మించిన ఈ చిత్రంలో సాంకేతికంగా ఉన్నతమైన వర్క్ చూచించనున్నారు.
ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. గత చిత్రాల పరాజయాలను అధిగమించి చైతన్య ఈ సినిమా ద్వారా మళ్లీ తన మార్క్‌ను నిలబెట్టుకుంటాడని ఆశిస్తున్నారు. పైగా సాయి పల్లవి (Sai Pallavi) , చైతన్య జంటగా నటించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. మొత్తం మీద, తండేల్ సినిమాతో నాగచైతన్య (Naga Chaitanya) పాన్ ఇండియా మార్కెట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. కంటెంట్ బలంగా ఉంటే, ఈ చిత్రం చైతన్య కెరీర్‌లోనే ఓ బిగ్ హిట్ అవుతుంది. మరి అతని కోరిక ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.