Nikhil, Kamal Haasan: దేశం పేరు విషయంలో కేంద్రం కొత్త ఆలోచన… సినిమాలు పేర్లు మారుతాయా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న చర్చ ‘ఇండియా – భారత్‌’. ఏంటీ ఈ రెండూ ఒకటే కదా.. మళ్లీ చర్చ ఏముంది అనుకుంటున్నారా? ఉంది చాలా తేడా ఉంది. ప్రపంచ దేశాల దగ్గర మన పేరు ఎక్కువగా ఇండియా అనే ఉంటుంది. రాజ్యాంగంలో, ప్రభుత్వ పత్రాల్లో… ఇలా చాలా చోట్ల రెండు పేర్లూ ఉన్నా ఇండియా అనేది ప్రముఖంగా ఉంటుంది. ఇక క్రీడల్లో జెర్సీల మీద కూడా అదే పేరు ఉంటుంది. దీనిని ఇప్పుడు భారత్‌గా మారుస్తారు అంటూ ఓ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమలో మరో చర్చ మొదలైంది.

ఇండియా పేరుతో మన దగ్గర ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో ఆ సినిమాల పేర్లు కూడా మారుస్తారా అనేది ప్రశ్న. కమల్‌ హాసన్‌ నట విశ్వరూపం చూపించిన సినిమాల్లో ‘భారతీయుడు’ ఒకటి. ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు దేశం పేరు ఇండియా నుండి భారత్‌ అయిపోతే ఆ సినిమాను ‘ఇండియన్‌ 2’ నుండి ‘భారతీయుడు 2’కు మారుస్తారా అనేది ప్రశ్న.

మరో సినిమా నిఖిల్ (Nikhil) హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘ది ఇండియా హౌస్‌’. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఆ సినిమాలో కూడా ఇండియా ఉండటం వల్ల ‘ది భారత్‌ హౌస్‌’ అని మారుస్తారా అనే చర్చ మొదలైంది. అయితే అప్పుడెప్పుడో జరిగిన కథ కాబట్టి దానిని ఆ పేరుతోనే పిలుస్తారు అని అనుకోవచ్చు. ఇక ‘ఇండియన్‌ 2’ పేరు కూడా మారుతుంది అనుకోలేం. ఎందుకంటే బీజీపే సర్కారు తీసుకునే నిర్ణయాలకు కమల్‌ హాసన్‌ అంత త్వరగా వత్తాసు పలకరు.

ఈ మొత్తం నేపథ్యంలో సినిమాల పేర్లు మారే అవకాశం అయితే లేదు. కానీ కొత్తగా వచ్చే సినిమాల సమయంలో మాత్రం కచ్చితంగా ‘భారత్‌’ అనే పేరుతో ఉండేలా చూసుకుంటారు. చూద్దాం… దేశం పేరు మారాక ఇంకెన్ని మార్పులు వస్తాయో.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus