టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నిఖిల్ కెరీర్ ను పరిశీలిస్తే కార్తికేయ2 ముందు కార్తికేయ2 తర్వాత ఆయన సినిమాల మార్కెట్ విషయంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. కార్తికేయ2 సినిమా సక్సెస్ తో నిఖిల్ పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయారు. మరో రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం నిఖిల్ రేంజ్ మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 18 పేజెస్ సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని నిఖిల్ భావిస్తుండటం గమనార్హం.
ఈ నెల 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా కావడం వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరో 16 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా నిఖిల్, అనుపమ కలిసి నటిస్తుండటం కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమని చెప్పవచ్చు. 18 పేజెస్ మూవీకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించడం గమనార్హం.
కుమారి 21ఎఫ్ సినిమా తర్వాత ఈ దర్శకుడు మరో ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిఖిల్ మార్కెట్ కు అనుగుణంగా 18 పేజెస్ మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో నిఖిల్ మరో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. నిఖిల్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
నిఖిల్ కు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. త్వరలో నిఖిల్ కొత్త ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది. నిఖిల్ ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. ప్రాజెక్ట్ ల ఎంపికలో నిఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుస సక్సెస్ లను అందుకునే దిశగా నిఖిల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.