చెర్రీ కోసం పవన్ వస్తాడా?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…దాదాపుగా 10ఏళ్ల క్రితం టాలీవుడ్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ కూడా బ్యాక్ కి రావడంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో అటు పవన్ కల్యాణ్…ఇటు రామ్‌చరణ్ ఇద్దరూ ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే పవన్ సినిమా కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకుని తన సినిమా రంగస్థలం ను డిసెంబర్ నెలలోనే రిలీజ్ చెయ్యనున్నాడు చెర్రీ. అయితే అదే క్రమంలో బాబాయి కోసం తాను చేసిన పనికి ఫలితంగా పవన్ ద్వారా తన సినిమాని ప్రమోట్ చేయించుకుని కాస్త హైప్ తెచ్చుకునే విధంగా ఆలోచన చేశాడు…ఆ ఆలోచనలో భాగంగానే…

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను కూడ వచ్చే వారం రాబోతున్న విజయదశమి రోజున లాంచ్ చేయడానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తుంది…ఇక ఈ ఫస్ట్ లుక్ ను పవన్ చేత విడుదల చేయించి ఈ మూవీకి మరింత క్రేజ్ ని తీసుకురావాలనే ఆలోచనతోనే కాకుండా ఈ దెబ్బతో మెగా ఫ్యామిలీ అంతా ఒకటిగానే ఉంది అన్న సంకేతాలు పంపే విధంగా కూడా చరణ్ పవన్ సహకారాన్ని ఆశిస్తున్నట్లు టాక్. ఎందుాక్ంటే ఈ మధ్య బాగా దూరం జరిగిన చరణ్ పవన్ లు తిరిగి దగ్గర అయితే మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతారు అన్నది చెర్రీ ప్లాన్…మరి అసలే పవన్ చాలా డిఫరెంట్, అందులోనూ ఇప్పుడు తాను పొలిటికల్ గాను బిజీ, ఇలాంటి సమయంలో మెగా అభిమానులు కోరుకునే ఈ మెమరబుల్ ఈవెంట్ ఎంతవరకూ నిజం అవుతుందో, చెర్రీ కోరికను పవన్ నెరవేరుస్తాడో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus