Prabhas: ప్రభాస్ తలచుకుంటే మాత్రమే ఆదిపురుష్ పై నెగిటివిటీ తగ్గుతుందా?

ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఈ మధ్య కాలంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు విమర్శలకు కారణమవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సినిమా ఈ స్థాయిలో విమర్శల పాలు కావడం ఆదిపురుష్ విషయంలోనే జరిగింది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో సైతం ఒకింత నెగిటివిటీ పెరుగుతోంది. గ్రాఫిక్స్ లో మార్పులు చేస్తున్నా ఈ సినిమాలో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు మరో రెండున్నర నెలల సమయం ఉందనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ప్రభాస్ జోక్యం చేసుకుంటే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఔట్ పుట్, గ్రాఫిక్స్ విషయంలో పొరపాట్లు రిపీట్ కాకుండా ప్రభాస్ జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుత రేంజ్ కు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ క్రేజ్ అణువంత కూడా తగ్గదు. అయితే ఆదిపురుష్ కథ, గెటప్ పరంగా పొరపాట్లు జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఫీలయ్యే ఛాన్స్ ఉంటుంది.

అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రభాస్ అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూన్ నెల 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఆదిపురుష్ సినిమా కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మేకర్స్ చెబుతున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఆదిపురుష్ ప్రతిసారి వివాదాల్లో చిక్కుకోవడంతో ఏం చేయాలో ఫ్యాన్స్ కు సైతం అర్థం కావడం లేదు.

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం సలార్, ప్రాజెక్ట్ కే 2000 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకొవడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus