Kannappa: ‘కన్నప్ప’ టీజర్.. వాళ్ళకి నిరాశ తప్పదా..!

మంచు విష్ణు హీరోగా ‘కన్నప్ప’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతుంది.’మహాభారతం’ అనే హిందీ సీరియల్‌ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘అవా ఎంటర్టైన్మెంట్స్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థల పై మంచు విష్ణు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి స్టార్స్ ‘కన్నప్ప’ స్క్రిప్ట్ డెవలప్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ‘కన్నప్ప’ లో నటిస్తుండటం విశేషం. కేవలం హీరో, డైరెక్టర్ ను బట్టి అయితే.. ఏమాత్రం ఆసక్తి కలిగించని ప్రాజెక్టు ఇది. కానీ ఇందులో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్లు నటిస్తుండటం..అన్నిటికీ మించి ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్ర పోషిస్తున్నాడు అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు.

పరమశివుడి పాత్రలో నటిస్తున్నట్టు మొదట్లో వార్తలు వినిపించాయి.. ఆ తర్వాత నందీశ్వరుడు పాత్ర అని.. ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే ఈరోజు అనగా జూన్ 14 న ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ కాబోతుంది. ఇందులో కచ్చితంగా ప్రభాస్ కనిపిస్తాడు అని అంతా అనుకుంటున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం..

ఈ టీజర్ లో ప్రభాస్ కనిపించే అవకాశాలు లేవని తెలుస్తుంది. ప్రభాస్ పాత్రని, లుక్ ని.. అతని పుట్టినరోజు వరకు రివీల్ చేసే ఛాన్స్ లేదని… యూనిట్ సభ్యులు అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus