రకుల్ ఆశలన్నీ ‘మన్మధుడు2’ పైనే.. ?

  • July 12, 2019 / 11:57 AM IST

గత కొంతకాలంగా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన సినిమాలన్నీ ప్లాపవుతూ వస్తున్నాయి. రెండేళ్ళుగా తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్టవ్వకపోవడంతో రేసులో వెనుకబడిపోయింది. బాలీవుడ్ లో చేసిన ‘దె దె ప్యార్ దే’ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఈ రెండేళ్ళుగా ఒక్క ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం మాత్రమే రకుల్ కి హిట్టని చెప్పాలి. ఈ చిత్రాన్ని నిర్మించింది నాగార్జున. ఇప్పుడు మళ్ళీ నాగార్జున చిత్రంలోనే చేస్తుంది రకుల్. ఈ చిత్రానికి కూడా నాగార్జునే నిర్మాత.

మళ్ళీ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్లో సినిమా చేస్తుంది కాబట్టి ఈసారి రకుల్ హిట్టందుకోవడం గ్యారంటీ అని ఫిలిం విశ్లేషకులు మొదటి నుండీ చెప్పుకొస్తున్నారు. అందుకు తగ్గట్టే.. ఇటీవల విడుదల చేసిన రకుల్ టీజర్ ను చూస్తే.. వారు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఈ టీజర్లో అవంతికగా… రకుల్ ఆకట్టుకుంటుంది. ఒక పక్క సంప్రదాయంగా కనిపిస్తూ.. మరోపక్క హాట్ హాట్ గా కనిపిస్తూ.. బోల్డ్ డైలాగ్స్ కూడా చెబుతుంది. రాహుల్ రవీంద్రన్ మొదటి చిత్రం ‘చి ల సౌ’ తో మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ చిత్రంలో లానే… ఈ చిత్రంలో కూడా ఎంటర్టైన్మెంట్ ను ఓ రేంజ్లో వడ్డించబోతున్నాడని సమాచారం. రకుల్ గ్లామర్.. నాగార్జున రొమాన్స్.. వెన్నెల కిశోర్ కామెడీ… ‘మన్మథుడు2’ లో హైలెట్ గా ఉండబోతున్నాయట. సో రెండేళ్ళుగా హిట్టు కోసం పడిగాపులు కాస్తున్న రకుల్ కి… ‘మన్మధుడు2’ తో మంచి హిట్టు లభించడం ఖాయమని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. మరి వారు చెప్పింది నిజమో కాదో తెలియాలంటే.. విడుదల తేదీ అయిన ఆగష్టు 9 వరకూ ఎదురుచూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus