చరణ్ (Ram Charan) సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ కాగా కథలోని ఆసక్తికర ట్విస్టులు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. అయితే చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు కొన్ని నెలల క్రితం వార్తలు వినిపించాయి. రాజమౌళి సైతం ఆ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లను ప్రకటించగా ఈ ప్రాజెక్ట్ లలో సుకుమార్ ప్రాజెక్ట్ లేదు.
మరోవైపు సుకుమార్ సైతం పుష్ప2 తర్వాత నటించే ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత లేదు. చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీ అయితే ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తారో లేదో చెప్పలేం. రామ్ చరణ్ కు కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని ఎన్నో కలలు, ఆశలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. చిరంజీవి సైతం రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా ఎదగాలని కోరుకుంటున్నారు. రామ్ చరణ్ భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా సుకుమార్ చరణ్ తో సినిమా విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.
సుకుమార్ తో పని చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తారు. రాజమౌళి తర్వాత ఆ స్థాయి టాలెంట్ ఉన్న దర్శకుడిగా సుకుమార్ కు పేరుంది. సుకుమార్ రైటింగ్ కు ఫిదా అయ్యామని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ రచయితలు సైతం పలు ఇంటర్వ్యూలలో చెబుతున్నారు.
సుకుమార్ పారితోషికం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా మైత్రీ బ్యానర్ లో వరుసగా సుకుమార్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. సుకుమార్ డైరెక్షన్ స్కిల్స్ కు ఇతర భాషల ఆడియన్స్ సైతం ఫిదా అవుతున్నారు. సుకుమార్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.