ప్రస్తుతం చరణ్ .. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రానికి కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సో ఇప్పుడు చరణ్ చాలా బిజీ..! ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా 2020 జూలై 30న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే రాజమౌళి ప్రకటించేశాడు. ఒక వేళ ఆ చిత్రం విడుదల లేటయినా ఒక నెల.. వరకూ లేటయ్యే అవకాశాలు మాత్రమే ఉండొచ్చు. అయితే ఆ చిత్రం తర్వాత రాంచరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే త్రివిక్రమ్, కొరటాల శివ వంటి అగ్ర దర్శకులు చరణ్ కోసం కథలు సిద్ధం చేసుకుని రెడీ గా ఉన్నారు.
ఇక తనకి ‘రంగస్థలం’ వంటి నాన్ – బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ కూడా చరణ్ కోసం మంచి కథని సిద్ధం చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా మరో దర్శకుడి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. డిఫరెంట్ సినిమాలు తీసే విక్రమ్.కె.కుమార్. ఈమధ్యే చరణ్ ను కలిసి ఓ కథ వినిపించాడట. స్క్రిప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని తెలుస్తుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యాకే తరువాతి సినిమా గురించి ఆలోచిస్తాను అని చరణ్ చెప్పడంతో విక్రమ్ ఓకే చెప్పి వెళ్ళిపోయాడట. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తర్వాత చరణ్ అంత రిస్క్ చేస్తాడా అనేది చర్చకు దారి తీసింది. అందులోనూ విక్రమ్ కుమార్ తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ కూడా పెద్దగా ఆడలేదు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!