Ranbir Kapoor: డిసెంబర్ లో రూ.100 కోట్లు కొట్టే మూవీ ఏది అంటే?

మొదటి రోజు వంద కోట్లు గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడం అంటే మాటలు కాదు.దర్శకుడు రాజమౌళికి అది కేక్ వాక్ లాంటిది. ‘బాహుబలి 2 ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల గ్రాస్ సినిమాలను అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ ‘బాహుబలి 2 ‘ ‘సాహో’ వంటి చిత్రాలతో ఆ ఫీట్ ను సాధించాడు. ఇక షారుఖ్ ఖాన్ కూడా ఈ ఏడాది ‘పఠాన్’ ‘జవాన్’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల గ్రాస్ మూవీస్ ను అందుకున్నాడు.

వీళ్ళు తప్ప బాలీవుడ్లో మరే హీరో కూడా ఆ రికార్డు కొట్టలేదు. ఇటీవల వచ్చిన ‘టైగర్ 3 ‘ తో కూడా సల్మాన్ ఖాన్ ఆ రికార్డు కొట్టలేకపోయాడు. అయితే డిసెంబర్లో మరో వంద కోట్ల గ్రాస్ మూవీ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ‘యానిమల్’ సినిమాతో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ఆ రికార్డు అందుకునే అవకాశం ఉంది.

సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉంది. ‘యానిమల్’ ట్రైలర్ కూడా దేశవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఆ ఫీట్ ను అందుకుంటుందో లేదో చూడాలి. మరోపక్క క్రిస్మస్ కి షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ ఆ సినిమాకి దర్శకుడు.

డౌట్ లేకుండా ఆ సినిమా వంద కోట్లు గ్రాస్ మార్క్ ను మొదటి రోజు అందుకునే అవకాశం ఉంది. అలాగే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘సలార్’ కూడా మొదటిరోజు వంద కోట్ల గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus