Rashmika, Sharwanand: రష్మిక అదృష్టం.. అతడిని కాపాడుతుందా..?

హీరో శర్వానంద్ తన రేంజ్ ను పెంచుకోవడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఏదీ కూడా సక్సెస్ ను తీసుకురాలేకపోయింది. అప్పుడెప్పుడో ‘మహానుభావుడు’ సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్ ఆ తరువాత మరో హిట్ కొట్టలేకపోయాడు. ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ ఇలా వరుసగా అన్నీ ఫ్లాపులే. నిజానికి ‘మహాసముద్రం’ భారీ అంచనాల మద్య విడుదలైంది. కానీ డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.

ఇప్పటికే ఐదు ఫ్లాప్ లు పడ్డాయి. దీంతో శర్వానంద్ ఆలోచనలో పడ్డాడు. అందుకే తన ఇమేజ్ కి తగిన విధంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే ఫ్యామిలీ కథలో నటిస్తున్నాడు. గతంలో ఈ జోనర్ లో నటించిన సినిమాలు శర్వానంద్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. పైగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. రష్మిక క్రేజ్, లక్ కలిసొస్తే..

ఈ సినిమాతో శర్వానంద్ హిట్ అందుకోవడం ఖాయం. మరి రష్మిక అదృష్టం అతడిని కాపాడుతుందో లేదో చూడాలి. దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus