మాస్ మహారాజ్ రవితేజకు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో రవితేజ మళ్లీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. అతి త్వరలో ఈ స్టార్ హీరో రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ నెల 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. రవితేజ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. రవితేజ పారితోషికం 20 కోట్ల రూపాయల స్థాయిలో ఉండగా రవితేజ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
రవితేజ సైతం కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రావణాసుర సినిమాకు సుధీర్ వర్మ డైరెక్టర్ కాగా ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్ సాధించడం కెరీర్ పరంగా సుధీర్ వర్మకు కీలకం అనే సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ కెరీర్ లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందో లేదో స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.
రవితేజ అటు సీనియర్ హీరోలకు, ఇటు యంగ్ జనరేషన్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. వయస్సు పెరుగుతున్నా రవితేజలో ఎనర్జీ ఏ మాత్రం తగ్గడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటే రవితేజ సినిమాలు సక్సెస్ సాధిస్తాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. రవితేజ కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమేనని చెప్పకనే చెబుతున్నారు.
రవితేజ సక్సెస్ రేట్ ను అంతకంతకూ పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రవితేజ ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రవితేజ స్టార్ డైరెక్టర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రవితేజ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. హీరోయిన్ల ఎంపికలో కూడా రవితేజ రూట్ మార్చాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?