Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుందా?

రవితేజ సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన రావణాసుర మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ఎక్కువ థియేటర్లలో టికెట్లు సులువుగానే లభిస్తున్నాయి. ఈ సినిమాకు 23 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగగా ఆ టార్గెట్ ను రీచ్ కావడం రవితేజకు సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన రేంజ్ లో లేకపోవడం ఫ్యాన్స్ కు షాకిస్తోంది.

అయితే పాజిటివ్ టాక్ వస్తే రావణాసుర రికార్డులు బ్రేక్ చేయడం కష్టం కాదని చెప్పవచ్చు. రవితేజ రెమ్యునరేషన్ ప్రస్తుతం 22 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి రవితేజ పారితోషికంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రవితేజ క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. రవితేజ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి. మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు.

రవితేజ (Ravi Teja) ఏడాదికి మూడు సినిమాలలో నటిస్తూ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ మల్టీస్టారర్ సినిమాలలో సైతం నటిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుండటం గమనార్హం. రవితేజ వయస్సు పెరుగుతున్నా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ విజయాలను అందుకుంటున్నారు. రవితేజ తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో సత్తా చాటుతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ వివాదాలకు దూరంగా ఉంటూ పాపులారిటీని పెంచుకుంటున్నారు.

రావణాసుర సినిమాకు పోటీగా మీటర్ సినిమా రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. రావణాసుర సినిమా ప్రమోషన్స్ లో వేగం పెరిగితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రవితేజ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారో లేదో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus