Robin Hood: నితిన్ మాటను లెక్క చేయట్లేదా?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) తన కెరీర్‌లో మరో మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ (Robinhood)   సినిమాతో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకీ కుడుముల  (Venky Kudumula)  దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘భీష్మ’తో (Bheeshma)  నితిన్ కెరీర్‌లో మెమరబుల్ హిట్ ఇచ్చిన వెంకీ, ఈసారి మరింత గ్రాండ్ గా ‘రాబిన్ హుడ్’ను తెరపైకి తీసుకురానున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల  (Sreeleela)   నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణ.

Robin Hood

జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)  సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్ మొదట ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని ప్రకటించారు. టీజర్, ఫస్ట్ సింగిల్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ రిలీజ్ కోసం మేకర్స్ సిద్ధమయ్యారని అనుకున్నా, అనూహ్యంగా సినిమా వాయిదా పడింది. మొన్నటి వరకు సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు.

అయితే పొంగల్ సీజన్‌లో ఇప్పటికే మూడు భారీ చిత్రాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ రేసులో నితిన్ ‘రాబిన్ హుడ్’ కూడా క్లిక్ అవుతుందని మొదట ఒక నమ్మకంతో కనిపించారు. కానీ, మేకర్స్ ఇప్పటికీ డేట్‌పై స్పష్టత ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ సంక్రాంతిని కాదని శివరాత్రి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కానీ, నితిన్ మాత్రం సంక్రాంతికి సినిమా తప్పకుండా విడుదల కావాలని కోరుతున్నట్లు వినిపిస్తోంది.

పెద్ద సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, కంటెంట్ మీద నమ్మకంతో ఈ ఫెస్టివ్ సీజన్‌లో సినిమా విడుదల అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నితిన్ నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్నారట. కానీ వారు మాత్రం నితిన్ మాటలను లెక్క చేయడం లేదని టాక్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. అయితే రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రాకపోవడం అభిమానుల్లో కన్ఫ్యూజన్ ను పెంచుతోంది.

గేమ్ ఛేంజర్.. బుకింగ్స్ ఓపెన్ అయినా పట్టించుకోరేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus