RRR: ఆర్ఆర్ఆర్ ఎప్పటికీ ఆ రికార్డును బ్రేక్ చేయలేదా?

గతేడాది విడుదలైన కేజీఎఫ్2 కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించడంతో పాటు పలు ఏరియాలలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కేజీఎఫ్ ఛాప్టర్2 ప్రపంచవ్యాప్తంగా 1230 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 1190 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. జపాన్ కలెక్షన్లతో కలిపి ఆర్ఆర్ఆర్ ఈ రేంజ్ లో కలెక్షన్లను సాధించింది. అయితే కేజీఎఫ్2 రికార్డును బ్రేక్ చేయడం ఆర్ఆర్ఆర్ కు కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ రాబోయే రోజుల్లో కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆస్కార్ రేసులో ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయిందని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ను మరిన్ని దేశాల్లో విడుదల చేస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రాజమౌళి పేరు మాత్రం మారుమ్రోగింది. జక్కన్న కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలిచిందని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొన్ని కమర్షియల్ అంశాలు మిస్సైనా ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించిందని కచ్చితంగా చెప్పవచ్చు. అటు చరణ్ ఫ్యాన్స్ కు ఇటు తారక్ ఫ్యాన్స్ కు ఆర్ఆర్ఆర్ మూవీ తెగ నచ్చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ బుల్లితెరపై కూడా మంచి రేటింగ్ లను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్2 దిశగా అడుగులు పడతాయేమో చూడాలి. రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్2 సినిమాను కచ్చితంగా తెరకెక్కించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తారక్, చరణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus