RRR Movie: బుల్లితెరపై ఆర్ఆర్ఆర్ సంచలనాలను సృష్టించనుందా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది మార్చి నెల 25వ తేదీన థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ జీ5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు ఓటీటీలలో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ అతి త్వరలో బుల్లితెరపై కూడా ప్రసారం కానుంది.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానల్ లో ఆగష్టు నెల 14వ తేదీన ఈ సినిమా ప్రసారం కానుంది. ఆర్ఆర్ఆర్ మలయాళం వెర్షన్ అదే రోజు రాత్రి 7 గంటలకు ఏషియన్ నెట్ లో ప్రసారం కానుండగా ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ జీ సినిమాస్ లో రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. బుల్లితెరపై ఆర్ఆర్ఆర్ రేటింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. గతంలో ఏ సినిమాకు రాని స్థాయిలో ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే థియేటర్లలో, ఓటీటీలలో చూసిన ఫ్యాన్స్ సైతం బుల్లితెరపై ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆదివారం రోజున ప్రసారం కానుండటంతో ఈ సినిమాకు అదిరిపోయే రేటింగ్ లు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా నిర్మాతలకు ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించిందనే సంగతి తెలిసిందే. నిర్మాత దానయ్యకు ఈ సినిమా ద్వారా 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా లాభాలు దక్కాయని సమాచారం అందుతోంది. రాజమౌళికి ఈ సినిమా ద్వారా భారీ మొత్తంలో లాభాలు దక్కాయని సమాచారం. జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus