Salaar: సలార్1 మూవీ ఆ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమా?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. చిన్నచిన్న లోపాలు ఉన్నా వాటి వల్ల సలార్ మూవీకి ఎలాంటి నష్టం లేదు. దేవా పాత్రలో ప్రభాస్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. టాక్ అనుకూలంగా ఉండటంతో సలార్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు ఎన్నో రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. సాధారణంగా మాస్ సినిమాలు క్రిటిక్స్ ను మెప్పించడం సులువు కాదు.

అయితే కేవలం 114 రోజుల పాటు షూటింగ్ ను జరుపుకున్న సలార్ మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. ప్రశాంత్ నీల్ డ్రామాతో తెరకెక్కిన సినిమాలను సైతం అద్భుతంగా తెరకెక్కించగలరని సలార్ ప్రూవ్ చేసింది. ఈ సినిమాతో పృథ్వీరాజ్ సుకుమారన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ శృతి కాంబినేషన్ లో సీన్లు ఎక్కువగా లేకపోయినా కథలో కీలక మలుపులకు శృతి పోషించిన ఆద్య పాత్ర కారణం కావడంతో ఆ పాత్ర కూడా ప్రేక్షకులకు నచ్చేసింది.

సినిమాలో యాక్షన్ సీన్లు ఎక్కువగానే ఉన్నా కథకు అనుగుణంగా ఆ యాక్షన్ సీన్లు రావడం గమనార్హం. సినిమాకు ఎడిటింగ్ హైలెట్ గా నిలిచింది. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సినిమాను ఫాలో అయ్యారు. సలార్ ముందు ఎన్నో భారీ రికార్డ్స్ ఉన్నాయి. లియో, ఆదుపురుష్ ఫస్ట్ డే కలెక్షన్లను, బాహుబలి2 ఫుల్ రన్ కలెక్షన్లను ఈ సినిమా దాటాల్సి ఉంది.

ఆ రికార్డులను సలార్ సులువుగానే బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. బాహుబలి2 తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కు ఈ సినిమాతో ఆ లోటు తీరినట్టే అని చెప్పాలి. సలార్ సంచలనాలు బాక్సాఫీస్ వద్ద మొదలయ్యాయనే చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎన్నో మెట్లు ఎదిగారనే చెప్పాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus