Shruti Haasan, Chiranjeevi: మెగాస్టార్ సినిమాకు శృతి ఓకే చెబుతారా?

ఈ మధ్య కాలంలో సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లను ఎంపిక చేయడం దర్శకనిర్మాతలకు సమస్యగా మారింది. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాబోయే నాలుగేళ్లలో ఏడాదికి కనీసం రెండు సినిమాలను రిలీజ్ చేసే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకక్కనుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపికైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చిరంజీవి రీఎంట్రీలో వరుసగా యంగ్ హీరోయిన్లతో నటిస్తూ అభిమానులను అవాక్కయ్యేలా చేస్తున్నారు. చరణ్ కు జోడీలుగా నటించిన కాజల్, తమన్నా చిరంజీవికి కూడా జోడీలుగా నటించిన సంగతి తెలిసిందే. ఎవడు సినిమాలో చరణ్ కు జోడీగా నటించిన శృతి హాసన్ తో దర్శకుడు బాబీ చిరంజీవి సినిమా కోసం చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా సలార్ సినిమాలో శృతి నటిస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీలో హీరోయిన్ గా శృతిహాసన్ ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి సినిమాకు శృతి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. చిరంజీవి బాబీ కాంబో మూవీకి వాల్తేరు శీను అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. జై లవకుశ, వెంకీ మామ విజయాల తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus