Shruti Haasan: ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్స్ కి శృతి వస్తుందా..?

  • January 10, 2023 / 12:24 AM IST

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో కూడా శృతిహాసనే హీరోయిన్ గా నటించింది. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్యకి భార్యగా, ‘వాల్తేర్ వీరయ్య’లో చిరంజీవికి శ్రీదేవిగా నటించింది. రీసెంట్ గా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్స్ జరిగాయి. వీటిలో ఒక కార్యక్రమానికే హాజరైంది శృతి. మరో ఈవెంట్ కి డుమ్మా కొట్టింది.

ఒంగోలులో నిర్వహించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈవెంట్ లో బ్లాక్ కలర్ శారీ కట్టుకొని హాట్ లుక్ లో మెరిసిపోయింది శృతి. ఆమె అందంతో ఈవెంట్ కే కల వచ్చింది. అయితే ఈ ఈవెంట్ కి వెళ్లొచ్చిన తరువాత ఆమెకి జ్వరం వచ్చింది. కోవిడ్ అనే అనుమానంతో ఇంట్లోనే ఉంది. ఇంకా ఆమె కోలుకోలేదు. దీంతో ఆదివారం నాడు వైజాగ్ లో జరిగిన ‘వాల్తేర్ వీరయ్య’ ఈవెంట్ కి హాజరు కాలేకపోయింది.

శృతికి ఆరోగ్యం బాగోలేదని.. ఆమె త్వరగా కోలుకోవాలని చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై అన్నారు. అయితే మెగాస్టార్ అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా శృతి హాసన్ ని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ‘ఆరోగ్యం బాగాలేక ఈవెంట్ కి హాజరు కాలేదు సరే కానీ.. సినిమాకి పబ్లిసిటీ చేస్తావా..? లేదా.?’ అంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు. శృతికి హెల్త్ సెట్ అయితే కచ్చితంగా రెండు సినిమాలను ప్రమోట్ చేస్తుంది.

లేదంటే మాత్రం రెండు సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేసి ఊరుకుంటుందేమో. శృతి ప్రమోషన్స్ లో పాల్గొంటే మాత్రం సినిమాలకు ప్లస్ అవుతుంది. మరేం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తుంది. ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’లో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus