Butta Bomma: ఆ సెంటిమెంట్ ప్రకారం ‘బుట్టబొమ్మ’ ‘సార్’ హిట్ అవ్వాలి మరి..!

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో నాగ వంశీ నిర్మించే సినిమాల పై జనాల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంటుంది. తాజాగా ‘బుట్టబొమ్మ’ సినిమా పై కూడా అలాంటి ఆసక్తి కనిపిస్తుంది. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల దృష్టి పడింది. ఎందుకంటే ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ కి రీమేక్ కాబట్టి..!

టీజర్, ట్రైలర్ లు కూడా బాగున్నాయి అనుకోండి..! అదలా ఉంచితే.. గత ఏడాది అంటే 2022 ఫిబ్రవరిలో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ నుండి ‘డిజె టిల్లు’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘భీమ్లా నాయక్’ హిట్ అనిపించుకున్నప్పటికీ.. ‘డిజె టిల్లు’ చిత్రం భారీ లాభాలను అందించింది. సో ‘ఫిబ్రవరి’ నెల ‘సితార..’ కి అలా కలిసొచ్చిందన్న మాట. అంతేకాదు అంతకు ముందు నితిన్ – రష్మిక కాంబినేషన్లో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ ని కూడా ‘సితార..’ నిర్మించడం జరిగింది.

ఆ మూవీ కూడా 2020 ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. అదే సెంటిమెంట్ తో 2023 ఫిబ్రవరి కూడా ‘సితార..’ కి కలిసొస్తుంది అని అంతా భావిస్తున్నారు. ఫిబ్రవరి 4న ‘బుట్టబొమ్మ’ రిలీజ్ అవుతుంది. అలాగే ఫిబ్రవరి 17న ధనుష్ ‘సార్’ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు కనుక హిట్ అయితే ‘సితార..’ కి ఫిబ్రవరి కలిసొచ్చే నెలగా మారడం ఖాయమనే చెప్పాలి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus