Will Smith: క్రిస్ రాక్ పై చేయి చేసుకోవడంతో పశ్చాత్తాపడుతున్న స్మిత్?
- August 1, 2022 / 01:26 PM ISTByFilmy Focus
గత కొన్ని నెలల క్రితం హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ఆస్కార్ అవార్డు వేడుకలో భాగంగా నటుడు క్రిస్ రాక్ పై అందరూ చూస్తుండగానే వేదికపై చేయి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ అవార్డు వేడుకలో భాగంగా క్రిస్ రాక్ విల్ స్మిత్ భార్య గురించి తన ఆరోగ్య పరిస్థితి గురించి హేళన చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విల్ స్మిత్ తనపై చేయి చేసుకున్నారు. ఈ విధంగా తనని కొట్టడమే కాకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడారు.
ఈ విధంగా విల్ స్మిత్ వ్యవహార శైలి చూసిన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తను అలా మాట్లాడిన వేదికపై కొట్టడం తప్పు అంటూ కొందరు నటుడు క్రిస్ రాక్ కి మద్దతు తెలుపగా మరికొందరు మాత్రం విల్ స్మిత్ కి మద్దతు తెలిపారు. అయితే ఆ సమయంలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోనటువంటి విల్ స్మిత్ వ్యవహారంపై ఆస్కార్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విల్ స్మిత్ కి మరోసారి ఈ ఘటన గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. క్రిస్ రాక్ ను కొట్టినందుకు ఫీలయ్యారా? అనే ప్రశ్న ఎదురయింది. ఆయనకి ఎప్పుడు క్షమాపణలు చెప్పాలనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు విల్ స్మిత్ సమాధానం చెబుతూ.. ఈ ఘటన తర్వాత నేను క్రిస్ రాక్ తో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. కానీ అతను నాతో మాట్లాడటానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా స్మిత్ తెలిపారు.

ఇలా తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడినటువంటి తనకు ఇలా బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను అంటూ స్మిత్ నటుడు క్రిస్ రాక్ కి క్షమాపణలు చెప్పారు. ఈ క్షమాపణలు తనకు సరిపోవని నాకు తెలుసు తాను ఎక్కడుంటే నేనే అక్కడికి వెళ్లి తనకు తన కుటుంబానికి, ఆస్కార్ కమిటీకి, నావల్ల బాధపడిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతానని ఈ సందర్భంగా స్మిత్ ఎంతో పశ్చాత్తాప పడ్డారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Will Smith apologises to Chris Rock and fans over Oscars slap pic.twitter.com/q7OxxGfd6G
— The Independent (@Independent) July 29, 2022
రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?











