Sreeleela: ఆ రెండు సినిమాలతో శ్రీలీల కోరుకున్న సక్సెస్ దక్కుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల (Sreeleela) కొన్ని నెలల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో శ్రీలీల రోజుకు రెండు షిప్ట్ లు, మూడు షిప్ట్ లలో పని చేసిన సందర్భాలు ఉన్నాయి. గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ కమర్షియల్ హిట్టైనా ఈ సినిమాకు ముందు శ్రీలీల నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గాయి. అయితే ప్రస్తుతం శ్రీలీల రాబిన్ హుడ్ (Robinhood) , ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలలో నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలే శ్రీలీల భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయి. శ్రీలీల కెరీర్ పరంగా ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా ఆఫర్ల విషయంలో వెనుకబడ్డారు. ఇతర భాషలపై ఫోకస్ పెట్టకపోవడం శ్రీలీలకు ఒకింత మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. క్రేజ్ ఉన్న హీరోల పక్కన ఛాన్స్ కోసం శ్రీలీల ఎదురుచూస్తుండగా త్వరలో ఆమెకు కొత్త అఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.

శ్రీలీల రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. శ్రీలీల నటిస్తున్న సినిమాలు థియేటర్లలో విడుదలై హిట్టైతే ఆమెకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. శ్రీలీల ఇంకా చాలామంది క్రేజ్ ఉన్న హీరోలకు జోడీగా నటించలేదు. ఆ హీరోలు ఛాన్స్ ఇస్తే కూడా శ్రీలీల దశ తిరిగినట్టేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీల యాక్టింగ్ కు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

శ్రీలీల సినిమాలు వరుసగా ఆశించిన ఫలితాలను అందుకోకపోవడం వల్లే ఆమెకు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది. శ్రీలీల బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెడితే మరింత మంచిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీల సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. శ్రీలీల ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus