సుల్తాన్ రష్మికను పెళ్లి చేసుకుంటాడా?

టాలీవుడ్ లక్కీ లేడీ రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె సౌత్ లో వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే రష్మిక రెండు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. మహేష్ కి జంటగా ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత నితిన్ తో భీష్మ చిత్రం కోసం జతకట్టగా సూపర్ హిట్ గా నిలిచింది. దీనితో రష్మిక సినిమాలో ఉంటే గ్యారంటీ హిట్ అనే ముద్ర పడిపోయింది.

దీనితో స్టార్ హీరోల కన్ను కూడా రష్మిక వైపు మళ్లింది. అందుకే అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం రష్మికను తీసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నారు. కాగా తమిళ్ లో కూడా రష్మిక మందాన ఎంట్రీ ఇవ్వనున్నారు. కార్తీక్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ మూవీతో ఆమె తమిళ్ లో పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడం జరిగింది.

దాని సంబంధించిన ఫోటో రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పెళ్లి వేడుక సెట్ లో మూవీ సిబ్బందితో కార్తీ మరియు రష్మిక పోజిచ్చారు. తెల్ల బట్టలలో కార్తీ ఉండగా, ఎర్ర చీరలో ముస్తాబై ఈ జంట కనిపించారు. అంటే సినిమా ఎండింగ్ వీరి పెళ్లితో ఉంటుందేమో అనిపిస్తుంది. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.


Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus