అప్పట్లో సావిత్రి తెలుగు ప్రజలను తన నటనతో ఆకట్టుకోగా, ఆమె తరువాత అందాల భామ సౌందర్య సావిత్రిని మరిపించి అందరినీ మనసులను దోచుకోగా, ఆమె మరణానంతరం ఎంతో మంది తారలు సౌందర్య స్థానాన్ని భర్తీ సెహ్స్యాదానికి ప్రయత్నాలు చేశారు. అయితే వారు ఎంతవరకూ సక్సెస్ అయ్యారు? అసలు సౌందర్యను వారి మరిపించగలిగార? ఒక లుక్ ఏద్దాం రండి.
అందాల భామ అనుష్క గ్ల్యామర్ గర్ల్ గా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ అటుపై మంచి మంచి పాత్రలు చేస్తూ దూసుకుపోయింది. అరుందతి చిత్రంతో టాప్ హీరోయిన్ గా మంచి స్థానాన్ని సంపాదించిన అనుష్క, వేదం, బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
నయన తార, తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ భామ, కరియర్ స్టార్టింగ్ లో రజని కాంత్ వంటి టాప్ హీరోతో నటించగా, ఆ తరువాత శ్రీ రామ రాజ్యం, కృష్ణం వందే జగధ్గురుమ్, వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళంలో తని ఒరువన్, తాజాగా నేను రౌడీ అన్న సినిమాలో నటించి మెప్పించింది.
తొలి సినిమా లక్ష్మి కళ్యాణంతో తనదైన ముద్రను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన కాజల్ ఆతరువాత టాప్ హిట్స్ తో దూసుకుపోయింది. మగధీర, ఆర్య 2, తాజాగా టెంపర్ చిత్రాలతో హిట్ హీరోయిన్ గా సాగుతుంది.
అందాల భామ సమంత నాగ చైతన్యతో కలసి నటించిన “ఏం మాయ చేసావే” చిత్రం భారీ హిట్ కొట్టి సమంతను టాప్ హీరోయిన్ గా మలచింది. ఇక అటుపై దూకుడు, ఈగ, మనం చిత్రాలతో ఆమె హిట్ కరియర్ ను కొనసాగిస్తుంది.
మళయాళ భామ నిత్య మీనన్ “అలా మొదలయింది” సినిమాతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అటుపై తెలుగు తమిళ బాషల్లో హిట్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
17ఏళ్ళకే నటనను ప్రారంభించిన అందాల భామ తమన్న హ్యాపీ డేస్ సినిమాతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె కరియర్ లో భారీ హిట్ అయితే ఏమీ లేవు కానీ, అవకాశాలకు మాత్రం కొదవలేకుండా భారీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది.
అందాల భామ శ్రుతి హసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస ఫేల్యూవర్స్ ఎదుర్కున్నప్పటికీ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో భారీ హిట్ అందుకుంది, ఇక అటుపై రేస్ గుర్రం, శ్రీమంతుడు భారీ హిట్స్ కావడంతో సూపర్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది.