ఈ టాలీవుడ్ హీరోయిన్లకు కొత్త ఆఫర్లు వస్తాయా?

సాధారణంగా హిట్ టాక్ వచ్చిన సినిమాలలో నటించిన హీరోయిన్లకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయి. అయితే కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా ఆ హీరోయిన్లకు సినిమా ఆఫర్లు రావడం కష్టమవుతోంది. ఈ విధంగా జరగడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. బింబిసార సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లలో ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. బింబిసార సక్సెస్ సాధించినా హీరోయిన్లకు ఈ సినిమా వల్ల కొత్త ఆఫర్లు వస్తాయో రావో చెప్పలేము.

గత నెలలో హిట్టైన కార్తికేయ2 అనుపమ పరమేశ్వరన్ కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదనే సంగతి తెలిసిందే. కార్తికేయ2 హీరో, డైరెక్టర్ కు వచ్చిన స్థాయిలో అనుపమకు ప్రశంసలు దక్కలేదు. ఈ సినిమాలో అనుపమ కాకుండా మరెవరు నటించినా కూడా కార్తికేయ2 రిజల్ట్ లో పెద్దగా మార్పు ఉండేది కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 9వ తేదీన ఒకే ఒక జీవితం సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా నటించారు.

అయితే హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ రీతూవర్మకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే రీతూవర్మ ఎక్కువగా కనిపిస్తున్నారు. గ్లామర్ రోల్స్ ను ఆమె ఎందుకు ఎంచుకోవడం లేదో తెలియాల్సి ఉంది. ఈ హీరోయిన్ల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

కొంతమంది హీరోయిన్లకు టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ ఆ హీరోయిన్లకు సినిమా ఆఫర్లు ఎక్కువగా రాకపోవడం అభిమానులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు రాబోయే రోజుల్లో వరుస ఆఫర్లతో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. తమకు ఆఫర్లు ఎక్కువగా రాకపోవడం గురించి ఈ హీరోయిన్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus