‘పుష్ప’ అంటూ మొదలై ‘పుష్ప: ది రైజ్’ (Pushpa), ‘పుష్ప: ది రూల్’గా (Pushpa 2: The Rule) రెండు ముక్కలు అయింది. ‘పుష్ప 2’ షూటింగ్ జరుగుతుండగా మూడోసారి కూడా ‘పుష్ప’రాజ్ వస్తాడు అని ఓ టాక్ వచ్చింది. సినిమా టీమ్ నుండి అధికారిక సమాచారం లేకపోయినా.. పక్కాగా వస్తాడు అని సన్నిహిత వర్గాల నుండి సమాచారం వచ్చింది. సినిమా రిలీజ్‌కు కాస్త ముందు ‘పుష్ప: ర్యాంపేజ్’ అని పేరు లీక్ చేశారు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ (Sukumar) మాటలు వింటుంటే మూడో ‘పుష్ప’తో సినిమా ఆగేలా లేదు.
‘పుష్ప 3’ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు వస్తుంది, ఉంటుందా, లేదా.. ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చెప్పడం అసాధ్యం కూడా. ఎందుకంటే ‘పుష్ప’ సిరీస్‌కు గ్యాప్ ఇవ్వాలని టీమ్ అనుకుంటోంది. ఎవరికి వారు ఇతర ప్రాజెక్టులు చేసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్‌ను రెండు సినిమాలతో ఆపేయాలని అని మాత్రం అనుకోవడం లేదట. దర్శకుడు సుకుమార్ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది.
‘పుష్ప: ది రూల్’ సినిమాతో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు తీసుకొచ్చింది సినిమా సీఈవో చెర్రీనేనట. ఆయన సలహాతోనే ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా చేశారట. సినిమా షూటింగ్ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి మూడు గంటల పుటేజ్ వచ్చిందట. దీంతో అక్కడితో ఆపేసి ఫస్ట్ పార్టుగా రిలీజ్ చేసేశాం అని సుకుమార్ చెప్పారు. ‘పుష్ప 2’ అవుతున్నప్పుడే ‘పుష్ప 3’ అని చెర్రీ అన్నారట. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో ఈ సిరీస్ ఎక్కడి దాకా వెళ్తుందో తెలియడం లేదు అని సుకుమార్ అన్నారు.
ఆయన మాటలు వింటుంటే ‘పుష్ప’ సినిమాల్ని మూడో పార్టుతో ఆపేలా లేరు. అయితే మూడో పార్టు వచ్చాక కానీ ఈ విషయంలో స్పష్టత రాదు. అలాగే ‘పుష్ప’ సిరీస్ కంటిన్యూ చేస్తూ హీరోలను, నేపథ్యాన్ని మారుస్తారు అనే చర్చ జరుగుతోంది. మరి లెక్కల మాస్టారు ఏం ఆలోచన చేస్తున్నారో ఏమో.
పుష్ప 3 ఏంటో నాకూ తెలీదు.. కానీ అదొక అద్భుతం అనిపిస్తుంది: అల్లు అర్జున్#AlluArjun #Sukumar #Pushpa #Pushpa3TheRampage pic.twitter.com/kK9Fb8KrV2
— Filmy Focus (@FilmyFocus) February 8, 2025