Nandamuri Hero: ఈ నందమూరి హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉండగా నందమూరి కుటుంబం నుంచి ఎవరైనా హీరోగా ఎంట్రీ ఇస్తే నందమూరి ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంటుందనే సంగతి తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నందమూరి జయకృష్ణ తనయుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చైతన్య కృష్ణ నటించిన బ్రీత్ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ కావడం గమనార్హం.

ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో లాంఛనంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో చైతన్య కృష్ణ రొటీన్ కు భిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ఈ టీజర్ ద్వారా అర్థమవుతోంది. వైద్యో నారాయణో హరి అనే ట్యాగ్ లైన్ తో బ్రీత్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ కావడం గమనార్హం.

మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు నందమూరి జయకృష్ణ పేరు నిర్మాతగా ఉండగా వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది.

(Nandamuri Hero) నందమూరి చైతన్య కృష్ణకు జోడీగా ఈ సినిమాలో వైదిక సెంజలియా నటించారు. చైతన్య కృష్ణ లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. మార్క్ కే రాబిన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. నందమూరి చైతన్య కృష్ణ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చైతన్య కృష్ణకు నందమూరి హీరోలు సపోర్ట్ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus