ఐపీఎల్ సీజన్ వస్తోంది అనగానే.. ఓ రెండు నెలలు సాయంత్రం ఇళ్లలో ఓ చర్చ జరుగుతుంది. అదే ఐపీఎల్ వర్సెస్ సీరియల్స్. మ్యాచ్ చూడాలని యూత్.. సీరియల్స్, న్యూస్ చూడాలని సీనియర్లు అనుకుంటారు. అయితే ఓటీటీల్లో ఐపీఎల్ స్ట్రీమింగ్ మొదలయ్యాక ఆ ఇబ్బంది చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఓ చర్చ మాత్రం మిగిలిపోయింది. అదే ఐపీఎల్ వర్సెస్ సినిమా. ఓ 18 ఏళ్ల క్రితం వరకు ఇండియన్ సినిమాకు సమ్మర్ అనేది ఓ బెస్ట్ సీజన్.
సంక్రాంతి తర్వాత ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే సీజన్ ఇది. అయితే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాక ఇది బాగా తగ్గింది అని చెప్పాలి. ఉదయం పూట రెండు షోల విషయంలో సమ్మర్ ఎండలకు తట్టుకోలేక జనాలు రాక తగ్గితే.. రాత్రి రెండు షోల విషయంలో ఐపీఎల్ ఆధిపత్యం చలాయిస్తోంది. దీంతో సమ్మర్‌లో సినిమాలకు యువత రాక విషయంలో మొదటి రెండు షోస్ కీలకంగా మారాయి. ఇప్పుడు మరో మూడు రోజుల్లో ఐపీఎల్ మొదలవుతోంది. రెండు నెలల పాటు ఈ హంగామా సాగుతుంది.
అయితే సినిమాల రాక కూడా ఈ సమయంలోనే ఉండనుంది. మరి ఐపీఎల్ హీట్‌ని సినిమాలు తట్టుకుంటాయా? తట్టుకున్నా వసూళ్లు అందుకుంటాయా అనేది చూడాలి. భారీ స్కోర్లు, అదిరిపోయే బ్యాటింగ్, బౌలింగ్ విన్యాసాలతో గతేడాది ఐపీఎల్ రంజురంజుగా సాగింది. కాబట్టి ఈసారి అంతకుమించి ఉంటుంది అని లెక్కేయొచ్చు. ఇక ఈ సమ్మర్‌లో రానున్న సినిమాలు సంగతి చూస్తే.. ఏవి తట్టుకుంటాయి, ఏవి చతికిలపడతాయి అనేది మీకే తెలిసిపోతుంది కూడా.
నితిన్(Nithiin) రాబిన్‌హుడ్ (Robinhood), సంగీత్ శోభన్(Sangeeth Shobhan) , నార్నే నితిన్ (Narne Nithin), రామ్ నితిన్ (Ram Nithin) ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square), సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) జాక్ (Jack), అజిత్ (Ajith Kumar) గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly), అనుష్క (Anushka Shetty) – క్రిష్ (Krish Jagarlamudi) ‘ఘాటి’(Ghaati), ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ (The Rajasaab), ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’, మంచు విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ (Kannappa) , నాని(Nani) హిట్ 3 (HIT 3) , పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) , రవితేజ(Ravi Teja) ‘మాస్ జాతర’(Mass Jathara) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కింగ్‌డమ్ (Kingdom) ఇలా వచ్చే వాటిలో ఉన్నాయి. అయితే వీటిలో ఎన్ని పోటీ సమయానికి నిలుస్తాయో చూడాలి.