టాలీవుడ్‌లో దర్శకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ప్రస్తుతం ఒక ఊహించని గ్యాప్‌లో ఉన్నాడు. ‘పెళ్లిచూపులు’తో (Pelli Choopulu) దర్శకుడిగా పరిచయమైన అతను, ఆ ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా విజయమే హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపుతిప్పిన ఘట్టం కూడా. కానీ అప్పటి నుంచి ఈ డైనమిక్ కాంబినేషన్ మరోసారి కలసి పని చేయలేదంటే ఆశ్చర్యమే. ఇప్పటికి విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో టాప్ యాక్టర్లలో ఒకడిగా ఎదిగిపోయాడు.
‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) నుంచి లైగర్ (Liger) వరకు, విజయ్ కెరీర్‌లో భారీ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో కింగ్ డమ్ (Kingdom) సినిమా చేస్తున్న విజయ్, ఆ తర్వాత రాహుల్ సంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో VD14లో నటించనున్నాడు. ఇవి కాకుండా ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) రెండో భాగంలో అర్జునుడిగా ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే, ఆయన ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindhi), ‘కీడా కోలా’ (Keedaa Cola) వంటి ప్రయోగాత్మక సినిమాలతో తన స్టైల్ ప్రూవ్ చేయాలనుకున్నా, మాస్ మార్కెట్‌లో పెద్దగా క్లిక్ కాలేకపోయాడు.
ఇప్పుడు మళ్లీ పాత మైత్రి జోడీగా విజయ్‌తో సినిమా చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, విజయ్ డేట్స్ విషయానికొస్తే మాత్రం పరిస్థితి అంత సులభంగా లేదు. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేలోపు మరో సంవత్సరం పట్టే అవకాశం ఉంది. దీంతో తరుణ్ భాస్కర్‌కు రౌడీ డేట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం తప్పదు.
ఒకవేళ టాలెంటెడ్ కథతో వెళ్లి ఆకట్టుకుంటే మాత్రం విజయ్ వెంటనే ఓకే చేసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి పాత మిత్రులైన వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఉత్కంఠ అభిమానులలో కొనసాగుతోంది. ఒకవేళ ఇది జరిగితే మాత్రం, ‘పెళ్లిచూపులు’ సక్సెస్‌ను మించిన మరో విజయం వచ్చే అవకాశం ఉండకపోలేదు. మరి వీరి కలయికకు ఎప్పుడు టైమ్ సెట్టవుతుందో చూడాలి.