Vaishanav Tej: వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాకు అలాంటి టైటిల్.. ఆది సెంటిమెంట్ తో?

వైష్ణవ్ తేజ్ కృతిశెట్టి బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కిన ఉప్పెన మూవీ సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలలో నటించగా ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని పొందలేదు. వైష్ణవ్ తేజ్ తర్వాత మూవీ కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

ఈ సినిమాకు ఆది కేశవ, ముక్కంటి టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆది మూవీ తరహా నారేషన్ తో ఈ సినిమా ఉంటుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఆది సెంటిమెంట్ ను ఈ సినిమా రిపీట్ చేస్తుందేమో చూడాలి. మాస్ ప్రేక్షకులలో ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తే మాత్రం వైష్ణవ్ తేజ్ కెరీర్ కు తిరుగుండదని చెప్పవచ్చు.

ఉప్పెన రేంజ్ హిట్ సాధిస్తే వైష్ణవ్ తేజ్ (Vaishanav Tej) కెరీర్ పరంగా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. కథల ఎంపికలో సాయితేజ్ వైష్ణవ్ తేజ్ కు సలహాలు ఇస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. సితార సంస్థ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాస్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus