బిగ్ బాస్ అనేది చిన్న సెలబ్రిటీలకు ఒక మంచి రంగస్థలం లాంటిది అని చెప్పవచ్చు. కాంట్రవర్సీలు ఎన్ని ఉన్నా కూడా మంచి కెరీర్ ను సెట్ చేసుకోవడానికి బిగ్ బాస్ షో చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆదాయం కూడా గట్టిగానే వస్తుండడంతో ఓ వర్గం చిన్న స్థాయి సెలబ్రిటీలు అటు వైపు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ షోలో విన్నర్స్ గా నిలిచిన వారిలో కెరీర్ పరంగా సక్సెస్ అయిన వారు చాలా తక్కువే అని చెప్పాలి.
బిగ్ బస్ మూడో సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తప్పితే మిగతా బిగ్ బాస్ సీజన్ విన్నర్స్ అందరూ కూడా కెరీర్ పరంగా డిజాస్టర్ అయ్యారు. మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ బిగ్ బాస్ తర్వాత వరుసగా సినిమాలు మొదలుపెట్టే ఒకటి రెండు సినిమాలతో తప్పితే మళ్లీ కనిపించలేదు. ఇక ఆ తర్వాత కౌశల్ మండా అయితే ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ అతనికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కనీసం చిన్న అవకాశాలు లేకపోవడం అసవహర్యకరం. ఇక నాలుగో సీజన్ లో అభిజిత్ మిస్టర్ కూల్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకొని విన్నర్ గా నిలిచాడు. తప్పకుండా అతను హీరోగా సక్సెస్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ అభి ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా ఎనౌన్స్ చేయకపోవడం మరో మిస్టరీ.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఐదో సీజన్ విజేతగా నిలిచిన సన్నీ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. జర్నలిస్ట్ నుంచి వీజే వరకు బాగానే కొనసాగిన సన్నీ ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరొక స్థాయికి చేరుకునే అవకాశం వచ్చింది. ఇక కెరీర్ పరంగా కనీసం సన్నీ అయినా బాగుపడతాడా లేదా అనేది మరో బిగ్ డౌట్.