ప్రభుదేవా, అనసూయ , రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వినూ వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వుల్ఫ్. సందేశ్ నాగరాజ్ ఈ చిత్రానికి నిర్మాత.తాజాగా ఈ చిత్రం నుండీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో ప్రభుదేవా, అనసూయ , రాయ్ లక్ష్మీ.. చాలా డిఫరెంట్ గెటప్ లలో కనిపించారు. ఈ టీజర్ లో హైలెట్ అయ్యింది కంప్లీట్ గా అనసూయనే..! ఎందుకంటే ఈ టీజర్ లో ఆమె గ్లామర్ షో ఓ రేంజ్లో ఉంది.
అలాగే ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించినట్టు స్పష్టమవుతుంది. అలాగే కొంచెం భయపెట్టే విధంగా కూడా ఆమె డ్రెస్సింగ్ ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా .. అనసూయ గతేడాది బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది. సినిమాల్లో అవకాశాలు ఎక్కువయ్యాయి అని, అలాగే జబర్దస్త్ లో అడిగినంత పారితోషికం ఇవ్వలేదు అని .. భావించి ఆమె బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది. అయితే తర్వాత సినిమా అవకాశాలు కూడా తగ్గినట్టు ఉన్నాయి.
అందుకే ఈమె గ్లామర్ కూడా పెంచేసి ఘాటైన ఫోటో షూట్లు చేస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న విమానం సినిమాలో కూడా సుమతి అనే వేశ్య పాత్ర చేసింది. అందులో కూడా అనసూయ కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించింది. కానీ హద్దులు దాట లేదు. కానీ వుల్ఫ్ సినిమాలో ఆమె ఎక్కువ ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించినట్టు స్పష్టమవుతుంది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి.. వుల్ఫ్ (Wolf )టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి: