Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » నేటి అమ్మాయిలను ప్రతిబింభించే పాత్రలు

నేటి అమ్మాయిలను ప్రతిబింభించే పాత్రలు

  • March 7, 2017 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేటి అమ్మాయిలను ప్రతిబింభించే పాత్రలు

స్ట్రాంగ్ హీరోయిన్స్. అంటే బలమైన శరీరం కలిగిన కథానాయికలు అని కాదు.. మానసికంగా దైర్యం కలిగిన వారని అర్ధం. తమకాళ్లపై బతకడం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, మనసులోని మాటను బయటకు చెప్పడం, జీవితంపై ఒక క్లారిటీ ఉండడం.. ఇవన్నీ నేటి అమ్మాయిల్లో ఉన్న క్వాలిటీస్. వాటిని ప్రతిబింభించే విధంగా నేటి దర్శకులు హీరోయిన్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నారు. నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ట్రాంగ్ హీరోయిన్ పాత్రలపై ఫోకస్..

మొగుడు ఎలా ఉండాలంటే ?Mirchi Movieతనకు కాబోయే భర్త ఎలా ఉండాలో నేటి అమ్మాయిలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ విషయాన్నీ మిర్చి సినిమాలో వెన్నెల (అనుష్క) పాత్ర చెప్పింది. “పెళ్లి అంటే జీవితంలో ఒకే సారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ (గుండెల్లో) పెట్టుకొని చూసుకొనే మనిషి దొరకాలి” అంటూ అమ్మాయిల కోరికను బయట పెట్టింది.

ఏ విషయం దాచుకోరు..Neninthe Movieప్రేమించిన సంగతిని మనసులోనే పెట్టుకొని, కుమిలిపోయే రకం కాదు ఇప్పటి అమ్మాయిలు. అటువంటివారికి అద్దం పట్టింది నేనింతే సినిమాలో సంధ్య పాత్ర. ఇందులో ఆమె ప్రేమించిన విషయాన్నీ ” ఒరే నీ పిచ్చి ఏమిటి అని అడిగావు గుర్తుందా ? నువ్వేరా నా పిచ్చి. పిచ్చి నా కొడకా.” అంటూ దైర్యంగా చెప్పి గుర్తుండి పోయేలా చేసుకుంది.

అంత ఈజీ కాదు Subramanyam For Saleఆనాటీ పేర్లు పెట్టుకున్నప్పటికీ నేటి అమ్మాయిలను బుట్టలో పడేయడం అంత ఈజీ కాదు. అదే విషయాన్నీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మూవీలో సీత పేరు పెట్టుకున్న హీరోయిన్ “సీత ఇక్కడ.. సీతతో అంత ఈజీ కాదు” అంటూ డైలాగ్ చెప్పి మనసుదోచుకుంది. ఈ పాత్రలో రెజీనా చక్కగా నటించింది.

అమాయకమే కానీ..Seetamma Vaakitlo Sirimalle chettuఇంకా అమ్మాయిల్లో అమాయకులు ఉన్నారు. కానీ వారికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి చేయాలో స్పష్టంగా తెలుసు. అందుకే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అంజలి పోషించిన సీత పాత్రని తెలుగువారందరూ ఇంట్లో సభ్యురాలిగా చేసుకున్నారు. ఆ క్యారక్టర్ చెప్పే “ఏమో.. నాకు అన్ని ఆలా తెలిసిపోతాయంతే” అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది.

ఉన్నదీ ఉన్నట్టుగా .. Andala Rakshashi“ఈ కాలం పిల్లలు అర్ధమే కారు..” నేటి యువతులను చూసి బామ్మలు అనే మాట ఇది. అవును ఏది ఎలా అడగాలో? ఎవరిని అడగాలో తెలియదు. అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ మిథున ఎవరు ఏమనుకుంటారోనని ఆలోచించకుండా .. “నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న”అంటూ ఉన్నదీ ఉన్నట్టూ చెప్పి నవ్వులు పూయించింది.

చిలిపిదనం Kothabangaru Lokamఅమ్మాయికి చిలిపిదనం ఉంటేనే అందం. కాలేజీకి వెళ్లిన అమ్మాయి తలదించుకుని ఇంటికి రావాలనే పాత చింతకాయ పచ్చడి లాంటి సూత్రాలను అటక మీద పెట్టి అబ్బాయిలతో సమానంగా కాలేజీలైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త బంగారు లోకం లో హీరోయిన్ స్వప్న “ఏ..క్క..డా”, “ఏం..దు..కు” అంటూ రాగాలు తీస్తూ మాట్లాడి ఆకట్టుకుంది.

కౌంట్ ఇక్కడ ..Venkatadri Expressనేటి అమ్మాయిలు ఉద్యోగం చేయడమే కాదు.. సంపాదించినా ప్రతి పైసాని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. అందుకు ప్రతి రూపమే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీలో ప్రార్ధన క్యారక్టర్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రార్ధన పాత్రలో అలరించింది. ” ప్రార్ధన.. ప్రతి పైసా కౌంట్ ఇక్కడ” అంటూ దడ దడలాడించింది.

ప్రశ్నించే తత్వంShashireka Parinayamమంచి ఆస్థి, చదువుకున్న కుర్రోడికి తన కూతురు నచ్చిందంటే.. కూతురి అభిప్రాయం కూడా అడగకుండా పెళ్ళిచేయడానికి కొంతమంది పేరెంట్స్ సిద్ధమయిపోతారు. ఆ విషయాన్నీ శశిరేఖా పరిణయంలో శశి క్యారక్టర్ ధైర్యంగా ప్రశ్నించి శెభాష్ అనిపించుకుంది.

ఇలా నేటి అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచే, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పాత్రలను సృష్టిస్తున్న గొప్ప దర్శకులకు మహిళా దినోత్సవం సందర్భం గా మహిళల తరుపున ఫిల్మ్ ఫోకస్ కృతజ్ఞతలు తెలుపుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Anjali
  • #Andala rakshasi movie
  • #Anushka
  • #kotha bangaru lokam Movie
  • #Mirchi Movie

Also Read

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

related news

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

trending news

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

18 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

16 hours ago
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

18 hours ago
Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

21 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

2 hours ago
హ్యాట్రిక్‌ ప్లాన్‌లో నాని.. ‘జూలియట్‌’గా ఆ డైరక్టర్‌కి కలిసొచ్చిన అమ్మాయే!

హ్యాట్రిక్‌ ప్లాన్‌లో నాని.. ‘జూలియట్‌’గా ఆ డైరక్టర్‌కి కలిసొచ్చిన అమ్మాయే!

2 hours ago
భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

3 hours ago
Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version